కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి, వాణిలకు ఛాన్స్
హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్యాహ్నం గవరన్నర్ నరసింహన్ను కలిసినట్లు సమాచారం.
నామినేటెడ్ ఎమ్మెల్సీల రేసులో పలువురు నేతలు ఉన్నాయి అయితే పీసీసీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి, పదవీకాలం పూర్తి కానున్న ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.