పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన వైఎస్ఆర్ సీపీ
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ నేతలు నందివర్గం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త శేఖర్ గౌడ్‌ను ఎస్సై నరేంద్రకుమార్‌రెడ్డి కొట్టారని పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పీఎస్‌ను ముట్టడించారు. శేఖర్ గౌడ్‌ను ఎస్సై అన్యాయంగా కొట్టారని, ఇందుకు నిరసనగా తాము ఇలా చేశామని పార్టీ నేతలు తెలిపారు. ఈ ముట్టడిలో జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.