ఆడపిల్లలకు చాకులిచ్చే చట్టం తెస్తాం
ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని
పాతపోస్టాఫీసు/విశాఖసిటీ: ఆడపిల్లల పట్ల పైశాచికంగా వ్యవహరించే వారి ఆట కట్టిస్తామని, ఇందులో భాగంగా ఆడపిల్లల చేతులకు చాకులు ఇచ్చేలా చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. అత్యాచారానికి గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విశాఖ ఏజెన్సీ లంబసింగి పంచాయతీ చెరువులవెన్నం గ్రామానికి చెందిన గిరిజన బాలికలను ఆమె బుధవారం పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే దోషులకు ఉరిశిక్ష విధింపు సరైన చర్య అని అభిప్రాయపడ్డారు.