నానో చేపలు.. మందులు చేరవేస్తాయి!
శరీరంలో అవసరమైన చోటుకి మందులను చేరవేసే అత్యాధునిక నానోస్థాయి రోబోను కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి చేరిస్తే చాలు.. ఇవి అయస్కాంతాల సాయంతో నిర్దేశిత ప్రాంతానికి చేపల్లా గా ఈదుతూ వెళ్లి మందులను విడుదల చేస్తాయి. బంగారు, వెండి, నికెల్ లోహాల తో తయారైన ఈ నానో చేపలు దాదాపు 2,400 నానో మీటర్ల పొడవుం టాయి. విద్యుదయస్కాంత ధర్మం కారణంగా వీటి తోక అటూ ఇటూ కదులుతుంటుంది. అయస్కాంత శక్తిని, దిశను మార్చడం ద్వారా నానో రోబో ఎక్కడికి వెళ్లాలన్నది నియంత్రించవచ్చు.
కేన్సర్ చికిత్సకూ ఇవి ఉపయోగపడతాయని అంచనా. అంతేకాక కణస్థాయిల్లో మార్పులు చేయాలన్నా వీటిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయి తే వీటిని ఖరీదైన లోహాలతో తయారుచేశామని, మరిన్ని పరిశోధనలతో చౌకగా తయారు చేసే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.