గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు
నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 4 వతేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 10గంటలకు స్వస్తి వాచనం, రాత్రి 8 గంటలకు అంకురార్పణం, మత్సంగ్రహణం. శుక్రవారం (30 వతేదీ) ఉదయం 10గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు భేరీపూజ, దేవత ఆహ్వానం, 31న ఉదయం 8గంటలకు హవనం, అలంకార సేవ, సింహవాహన సేవ, రాత్రి 8 గంటలకు హవనం, 9గంటలకు ఎదుర్కోలు మహోత్సవం. వచ్చేనెల 1న ఉదయం 8గంటలకు హవనం, స్వామి, అమ్మవార్లకు తిరుమంజన ఉత్సవం, హనుమంత సేవ, రాత్రి 7 గంటలకు హవనం, 10 గంటలకు స్వామి అమ్మవార్లకు తిరుకల్యాణ మహోత్సవం, 2 వతేదీ ఉదయం 8గంటలకు హవనం, గరుడవాహనం సేవ, రాత్రి 8 గంటలకు హోమం, రాత్రి 10 గంటలకు రథోత్సవం. 3న ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థం, రాత్రి 7గంటలకు దేవతాఉద్వాసనం, డోలారోహణం. 4 వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి శతఘటాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.