ఆశారాం, కొడుకు శాయిపైన అత్యాచారం కేసులు
గాంధీనగర్(పిటిఐ): వివాదాస్పద స్వామీజీ అశారాంపై మరో అత్యాచారం కేసు నమోదైంది. ఆశారం, అతని కుమారుడు నారాయణ శాయి తమపై అత్యాచారం చేసినట్లు సూరత్‌కు చెందిన అక్కచెల్లెళ్లు ఇద్దరు ఫిర్యాదు చేశారు. ఒక యువతి ఆశారం తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించగా, మరో యువతి అతని కొడుకు నారాయణ శాయి అత్యాచారం చేసినట్లు ఆరోపించారు. అహ్మదాబాద్ శివారులోని ఆశ్రమంలో ఉండగా ఆశారాం తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. 1997 నుంచి 2006 వరకు అత్యాచారం కొనసాగించినట్లు వివరించింది. తాను సూరత్ ఆశ్రమంలో ఉండగా నారాయణ శాయి 2002-2005 మధ్య కాలంలో తరచూ తనపై అత్యాచారం చేసిట్లు చెల్లెలు ఆరోపించింది.
కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య ఆశారాంను ఈరోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. శాయి ఎక్కడ ఉన్నది ఆచూకీ తెలియలేదు. అయితే అతను సూరత్ కోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశాడు.