ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి పరిస్థితి విషమం
నల్గొండ: నడిగూడెం మండలంలోని నారాయణపురం క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. వివరాలు...రెండు ద్విచక్ర వాహనాలు నారాయణపురం క్రాస్ వైపుకు వస్తుండగా మలుపు తిరిగే ప్రయత్నంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సిరిపురానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. రెండు ద్విచక్ర వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి.
(నడిగూడెం)