narayanaswami
-
‘తేడా వస్తే దబిడిదిబిడే’.. బాలకృష్ణపై మంత్రుల ఫైర్
సాక్షి, అమరావతి: హెల్త్ వర్సిటీకి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలపై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ‘చూడు బాలయ్య.... నీ కన్న తండ్రి ఎన్టీఆర్ గారి మీద వైశ్రాయ్ హోటల్ ముందు నీ బావ చంద్రుబాబు చెప్పుల వర్షం కురిపిస్తుంటే నువ్వు మందు తాగుతూ ఎంజాయ్ చేశావు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది.. అదే ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానిది’ అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చూడయ్య బాలకృష్ణ.... నీ కన్న తండ్రి ఎన్టీఆర్ గారి మీద వైశ్రాయ్ హోటల్ ముందు నీ బావ చంద్రబాబు చెప్పుల వర్షం కురిపిస్తుంటే నువ్వు మందు తాగుతూ ఎంజాయ్ చేశావు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. అదే ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానిది. — Narayanaswamy Kalathuru (@NSwamy_Official) September 24, 2022 రీల్ సింహం కాదు రియల్ సింహం.. బాలకృష్ణ ట్వీట్‌కి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు కౌంటర్ ట్వీట్ చేశారు. ‘ బాలయ్యా.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అసెంబ్లీలో అంత క్లియర్‌గా చెప్పాకా కూడా వైలెన్స్ చేయాలి అనుకుంటే.. అక్కడ ఉన్నది రీల్ సింహం కాదు రియల్ సింహం జగన్... తేడా వస్తే మీ బావ, బామ్మర్దులకు దబిడిదిబిడే..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి. బాలయ్యా.. ప్లూటు బాబు ముందు ఊదు... జగన్ గారి ముందు కాదు... అసెంబ్లీ లో అంత క్లియర్ గా చెప్పాకా కూడా వైలెన్స్ చేయాలి అనుకుంటే... అక్కడ ఉన్నది రీల్ సింహం కాదు రియల్ సింహం జగన్... తేడా వస్తే మీ బావ, బామ్మర్దులకు దబిడిదిబిడే... — Karumuri Venkata Nageswara Rao (@karumurionline) September 24, 2022 ఇదీ చదవండి: బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జగనన్న ముందు కాదు: మంత్రి రోజా కౌంటర్ -
‘పప్పు లోకేశ్.. నీకు నా సవాల్’
నంద్యాల: ఉప ఎన్నికలో లబ్ధిపొందడం కోసం టీడీపీ నేతలు కులాల వారిగా విభజించి చిచ్చు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో మాలలు, మాదిగలను, బలిజను, ముస్లింలను విడదీస్తున్నారని మండిపడ్డారు. సొంత మామ నందమూరి తారక రామారావును దించిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదని, అలాంటి ఆయనకు ప్రజలకు ఓ లెక్కా? అని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 140 సీట్లు వస్తాయని పప్పు అయిన పంచాయతీ రాజ్ మంత్రి లోకేష్ అంటున్నారని, ఇలాంటి మాటలు కట్టిపెట్టి ముందు దమ్మూ, ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తేనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. భూమా అఖిలప్రియ వైఎస్ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలితే నంద్యాల ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని నారాయణ స్వామి హెచ్చరించారు. -
'రైతుల ఆపద్బాంధవుడు వైఎస్ జగన్'
గుంటూరు: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గు లేదని.. డబ్బు పదవులకు ఆశపడే వారు బాబు పంచన చేరారని విమర్శించారు. ముఖ్యమంత్రి తీరును సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారన్నారు. మంగళవారం రైతు దీక్షా వేదిక వద్ద మాట్లాడిన నారాయణ స్వామి.. చంద్రబాబు పేదలకు ఒక్క ఇల్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, దళితుల పట్ల శత్రుత్వం పెంచుకున్నారని అన్నారు. గతంలో వైఎస్ఆర్ అన్నివర్గాలకు మేలు చేశారని గుర్తుచేశారు. రైతుల ఆపద్బాంధవుడు వైఎస్ జగన్ అని నారాయణస్వామి కొనియాడారు. -
వేరుశనగ రైతుల్ని ఆదుకోండి
–తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి –వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి డిమాండ్ పెనుమూరు: ఐదేళ్లుగా వేరుశనగ రైతులు పంట నష్టపోతున్నా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం గడప గడపకూ వెళ్తూ మోపిరెడ్డిపల్లె, ఉగ్రాణంపల్లె, మనబోటు పల్లె గ్రామాల్లో ఎండుతున్న వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలు కురవడంతో రైతులు 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగను సాగు చేస్తున్నారని చెప్పారు. సకాలంలో వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముందస్తుగా వేసిన పంటలో చెట్టుకు రెండు, మూడు కాయాలు కూడా దిగుబడి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు రూ. 15 వేలు వరకు రైతులు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నీరున్నా ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో సగటు ఉష్ణోగ్రత 38 డిగ్రీలు నమోదు కావడంతో వేరుశనగ పంటను రైతులు కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. వేరుశనగ పంటలను పరిశీలించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టరును నారాయణస్వామి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అతివృష్టి ... అనావృష్టిల కారణంగా రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో వర్షాలు లేక ప్రజలు కరువుతో అల్లాడిపోయారని నారాయణస్వామి గుర్తు చేశారు. తాజాగా రెండు సంవత్సరాలుగా పాలనలో తుపాన్ల ప్రభావంతో కురిసిన అకాల వర్షాలతో కంది, వరి, పూల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గత ఏడాది వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదు కోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా పార్టీ నేత వెంట పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దూది మోహన్, రైతు విభాగం అధ్యక్షులు గోవిందరెడ్డి, యువత అధ్యక్షులు మురళీ కుమార్‌రెడ్డి, మోపిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, రాజారెడ్డి, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మరెక్కడా గెలవలేడు
⇒ పేదల కడుపుకొట్టే పార్టీల మనుగడ సాధ్యంకాదు ⇒ పుష్కరాల పేరుతో ప్రజాధనం లూటీ ⇒ ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపాటు దిగువపల్లాలు(వెదురుకుప్పం) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో మరెక్కడ గెలిచినా తాను రాజకీయ సన్యాసం చేస్తానని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి సవాల్ విసిరారు. కుప్పంలో కూడా ఆయన బోగస్ ఓట్లతో గెలుస్తున్నారే తప్పా ప్రజాభిమానంతో కాదన్నారు. మండలంలోని దిగువపల్లాలు గ్రామంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పేదల కడుపుకొట్టే రాజకీయ పార్టీల మనుగడ అసాధ్యమన్నారు. పింఛన్లు మంజూరుకాక చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గతంలో మంజూరై నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా ఆపేసినట్లు చెప్పారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నట్లు ఆరోపించారు. రెండేళ్లలో రూ.300 కోట్లు ప్రచారానికే ఖర్చు పెట్టినట్లు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఆ డబ్బుతో రుణమాఫీ చేసి ఉండొచ్చని అన్నారు. రెండేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించినట్లు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు పేట ధనంజేయులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బట్టె సుబ్రమణ్యం, బీసీ జెల్ జిల్లా నాయకుడు మునస్వామి, సీనియర్ నాయకుడు పద్మనాభరెడ్డి, ఎంపీపీ పురుషోత్తం, జెడ్పీటీసీ సభ్యుడు మాధవరావ్, సర్పంచ్‌లు మునికష్ణారెడ్డి, గంగిరెడ్డి, నాయకులు లోకనాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మురగయ్య, ఆనందయ్య పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా నారాయణస్వామి
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా కళత్తూరు నారాయణస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన జిల్లా కన్వీనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం జరిగిన ఆ పార్టీ రెండో ప్లీనరీలో పలు జిల్లాల అధ్యక్షులను ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి నారాయణస్వామిని అధ్యక్షులుగా కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. 2011లో ఈయనను జిల్లా కన్వీనర్‌గా నియమించారు. ప్రస్తుతం గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా తనను నియమించడం పట్ల నారాయణస్వామి పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నగర అధ్యక్షుడుగా పాలగిరి ప్రతాప్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షులుగా పాలగిరి ప్రతాప్‌రెడ్డిని నియమించారు. ఈయన ప్రస్తుతం నగర కన్వీనర్ హోదాలో కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పాలగిరి నగర పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నగర పార్టీ అధ్యక్షుడుగా నియమించినందుకు వైఎస్.జగన్మోహన్రెడ్డికి, సహకరించిన జిల్లా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.