మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణస్వామి
చంద్రబాబు మరెక్కడా గెలవలేడు
Published Tue, Aug 16 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
⇒ పేదల కడుపుకొట్టే పార్టీల మనుగడ సాధ్యంకాదు
⇒ పుష్కరాల పేరుతో ప్రజాధనం లూటీ
⇒ ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపాటు
దిగువపల్లాలు(వెదురుకుప్పం) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో మరెక్కడ గెలిచినా తాను రాజకీయ సన్యాసం చేస్తానని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి సవాల్ విసిరారు. కుప్పంలో కూడా ఆయన బోగస్ ఓట్లతో గెలుస్తున్నారే తప్పా ప్రజాభిమానంతో కాదన్నారు. మండలంలోని దిగువపల్లాలు గ్రామంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పేదల కడుపుకొట్టే రాజకీయ పార్టీల మనుగడ అసాధ్యమన్నారు. పింఛన్లు మంజూరుకాక చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గతంలో మంజూరై నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా ఆపేసినట్లు చెప్పారు.
రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నట్లు ఆరోపించారు. రెండేళ్లలో రూ.300 కోట్లు ప్రచారానికే ఖర్చు పెట్టినట్లు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఆ డబ్బుతో రుణమాఫీ చేసి ఉండొచ్చని అన్నారు. రెండేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించినట్లు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు పేట ధనంజేయులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బట్టె సుబ్రమణ్యం, బీసీ జెల్ జిల్లా నాయకుడు మునస్వామి, సీనియర్ నాయకుడు పద్మనాభరెడ్డి, ఎంపీపీ పురుషోత్తం, జెడ్పీటీసీ సభ్యుడు మాధవరావ్, సర్పంచ్‌లు మునికష్ణారెడ్డి, గంగిరెడ్డి, నాయకులు లోకనాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మురగయ్య, ఆనందయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement