narnuru
-
గిరిపల్లెల్లో పులి సంచారం!
నార్నూర్(ఆసిఫాబాద్): వారంరోజులుగా గిరి పల్లెల్లో పులి సంచరిస్తుండడంతో గిరి జనులు భయాందోళనకు గురవుతున్నారు. ఐదురోజుల క్రితం మండలంలోని మల్కుగూడ శివారులో పత్తి ఏరేందుకు వెళ్లిన విజయలక్ష్మి అనే గిరిజన యువతికి పులి కనిపించడంతో తప్పించుకుని ఇంటికి పరుగులు తీసింది. ఈ సంఘటన మరువకముందే ఆదివారం మండలలోని ఎంపల్లి కొలాంగూడ గ్రామ శివారులో పత్తి చేనులోని పత్తి ఏరేందుకు వెళ్లిన గిరిజన మహిళ నీలాబాయితో పాటు మరో ఆరుగురు మహిళలకు పులి కనిపించడంతో ఇళ్లకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్‌కుమార్ గ్రామానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గిరిజనులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని ఎఫ్ఎస్వో ప్రకాష్ సందర్శించి పులిని చూసిన గిరిజన మహిళల ద్వారా సమాచారం సేకరించారు. పులి ఆనవాళ్లను పరిశీలిస్తున్నామన్నారు. గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పులి సంచరిస్తున్న విషయం తెలియడంతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కర్రలతో గస్తీ నిర్వహిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పులి సంచారంపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రాణాలు కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు. -
తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం
ఐకమత్యానికి ప్రతీక సేవాలాల్ దీక్షలు 41 రోజులపాటు దీక్షలు కొనసాగిస్తున్న బంజారాలు నార్నూర్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా గిరిజనులకు పెట్టింది పేరు.. అలాంటి గిరిజన తండాల్లో ప్రస్తుతం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బంజారాల ఆరాధ్యదైవం, కుల గురువు సంత్‌సేవాలాల్ మహరాజ్ దీక్షలు చేపట్టి బంజారాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ప్రారంభమైన ఈ దీక్షలు.. 41 రోజులకు ముగించనున్నారు. మరికొంత మంది సోమవారం నుంచి 21 రోజులపాటు దీక్షలు స్వీకరించనున్నారు. కాగా.. దీక్షలు శ్రీరామనవమి రోజున విరమించనున్నారు. 700 మందికి పైనే.. బంజారాల ఆరాధ్యాదైవం కుల గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ పేరిట మహాశివరాత్రి సందర్భంగా అదే రోజున ఈ దీక్షలను బంజారాలు చేపట్టారు. ఆదివారం హోలీ సందర్భంగా సేవాలాల్ భక్తులు దీక్ష భూమి వద్ద సంప్రదాయ పాటలు పాడుతూ, మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తండాల్లో ప్రతి ఒక్కరూ ఈ దీక్షలను తీసుకుంటారు. దీంతో తండాల్లో 41 రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. మండల కేంద్రంలోని కొత్తపల్లి (హెచ్) గ్రామంలో జాతీయ స్థాయిలో బంజారాల దీక్ష భూమి ఉంది. ఇక్కడికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది బంజారాలు వస్తారు. బంజార కులగురువు శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆధ్యాత్మిక మార్గంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని చాటి చెప్పారని పెద్దలు అంటుంటారు. 11 ఏళ్లుగా ఈ దీక్ష భూమి వద్ద బంజారాలు దీక్షలు కొనసాగించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. మండలంలోని కొత్తపల్లిలో 150 మంది, మల్లంగిలో 80 మంది, గంగాపూర్‌లో 100 మంది, నాగల్కొండలో 80 మంది, రాజన్గూడలో 20 మంది, మాగంలో 50 మంది, బీర్పూర్లో 40 మంది, తాడిహత్నూర్‌లో 60 మంది, ఉమ్రిలో 50 మంది తదితర గ్రామాల్లో దీక్షలు తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం.. తరతరాల నుంచి ఈ సంప్రదాయం వస్తోం ది. ఈ తరం వాళ్లు కూడా సంప్రదాయానికి కట్టుబడి సేవాలాల్ దీక్షలను చేపట్టడం ఆనందంగా ఉంది. ప్రతి తండాల్లో సేవాలాల్ దీక్షలను చేపట్టడంతో అంత పవిత్రత నెలకొంది. ఇది ఎప్పటికీ కొనసాగించాలి. - జాదవ్ రవితాబాయి ఇంటికొక్కరు చొప్పున దీక్షలో.. 41 రోజులపాటు తం డాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఇంటికొక్క రు చొప్పున సేవాలాల్ దీక్షలను చేపడుతారు. దీక్షలు చేపట్టం వలన అంతా మంచి జరుగుతుందని నమ్మకం. పురుషులతోపాటు మహిళలు సైతం ఈ దీక్షలను చేపడుతారు. - యశ్వంత్రావ్ -
హెచ్ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆందోళన
నార్నూర్, న్యూస్‌లైన్ : నార్నూర్‌లోని కస్తూరిబా గాంధీ విద్యాలయం(కేజీబీవీ) ప్రత్యేకాధికారి, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వసంత్‌రావ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆశ్రమ, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. 500 మందికి పైగా విద్యార్థినులు పాఠశాల నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ‘మా సారు మాకే కావాలి, వసంత్‌రావ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి’ అంటూ నినదించారు. ట్రెయినీ ఎస్సై రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ర్యాలీలు, ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కావని, పాఠశాల ఆవరణలోనే సమస్య పరిష్కరించుకోవాలని సూచించా రు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో పాఠశాలకు చేరుకుని ఆవరణలో బైఠాయించారు. మధ్యా హ్న భోజనం చేయడానికి నిరాకరించగా కౌన్సెలింగ్ చేసి ఆందోళన విరమింపజేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో చందన పాఠశాలను సందర్శించారు. వసంత్‌రావ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థినులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఏటీడబ్ల్యూవో సూచించారు. చదువు కావాలా.. సారు కావాలా అంటూ సున్నితంగా మందలించారు. రెండ్రోజుల్లో వేరే ఉపాధ్యాయులను నియమిస్తామని, చదువుకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఆమె వెంట పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాథోడ్ ఉత్తం, పాఠశాల ఉపాధ్యాయుడు జగన్నాథ్ ఉన్నారు.