Narsapuram-guntur fast passenger
-
ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం
సాక్షి, వీరవాసరం(పశ్చిమగోదావరి జిల్లా) : నరసాపురం - గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలుకు ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. వీరవాసరం చేరేసరికి ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. బ్రేక్ స్ట్రక్ అవడంతో ఇంజిన్ వద్ద పొగలు వచ్చాయని గుర్తించిన సిబ్బంది, పెన్నాడ వద్ద రైలును నిలిపి అరగంట పాటు మరమతులు చేశారు. తర్వాత రైలు బయలుదేరింది. గండం తప్పడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
నర్సాపూర్ ఫాస్ట్ ప్యాసింజర్కు తప్పిన ప్రమాదం
భీమవరం : నర్సాపురం-గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్కు మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. ఉండి వద్ద రైలు పట్టా విరిగింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. రైలును కొద్దిసేపు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.