
సాక్షి, వీరవాసరం(పశ్చిమగోదావరి జిల్లా) : నరసాపురం - గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలుకు ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. వీరవాసరం చేరేసరికి ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
బ్రేక్ స్ట్రక్ అవడంతో ఇంజిన్ వద్ద పొగలు వచ్చాయని గుర్తించిన సిబ్బంది, పెన్నాడ వద్ద రైలును నిలిపి అరగంట పాటు మరమతులు చేశారు. తర్వాత రైలు బయలుదేరింది. గండం తప్పడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment