veeravasaram
-
ఫోర్జరీ కేసులో జనసేన జెడ్పీటీసీ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఫోర్జరీ పత్రాలతో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లు దక్కించుకున్న వ్యవహారంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు బృందంపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని 32 జిల్లాల్లోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలను వదిలేందుకు ఆ రాష్ట్ర మత్స్యశాఖ సుమారు రూ.113 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. భీమవరానికి చెందిన జన సేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు పలువురి పేర్లతో తెలంగాణలో 9 నుంచి 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాడు. అయితే, బ్యాంకు గ్యారెంటీ, పర్ఫామెన్స్ గ్యారెంటీల విషయంలో మోసానికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. బ్యాంకు గ్యారెంటీ నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. -
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు దొంగలుగా మారారు
-
నగదు మాయం కేసు: రక్షకులే.. దొంగలై..
వీరవాసరం(పశ్చిమగోదావరి): ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు దొంగలుగా మారారు. పోలీస్‌స్టేషన్‌లో భ ద్రపరిచిన నగదును అహరించారు. వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో నగదు మాయమైన కేసులో నిందితులు పట్టుబడ్డారు. వీరవాసరంలో జిల్లా ఎస్పీ నారాయణనాయక్ శనివారం విలేకరులకు వివరా లు వెల్లడించారు. వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో ఉసురుమర్తి గంగాజలం, గొర్రెల గణేశ్వరరావు (గణేష్) కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. మండలంలోని మ ద్యం షాపుల సిబ్బంది బ్యాంకు సెలవులు కావడంతో ఈనెల 15న సాయంత్రం మద్యం అమ్మకాల సొమ్ము రూ.8,04,330ను ట్రంకు పెట్టెలో ఉంచి సీల్ వేసి పోలీస్‌స్టేషన్ లాకప్ గదిలో పోలీసుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. బ్యాంకులో జమ చేయ డానికి 17న ఉదయం 9 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ట్రంకు పెట్టెలో నగదు మాయమైంది. దీనిపై నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి పర్యవేక్షణలో పాలకొల్లు పట్టణ ఇన్స్పెక్టర్ సీహెచ్ ఆంజనేయులు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిందిలా.. పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఉసురుమర్తి గంగాజలం, గొర్రెల గణేశ్వరరావు (గణేష్) పథకం ప్రకారం చోరీకి సన్నద్ధమయ్యారు. డ్యూటీ లేని సమయంలో చోరీ చేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గంగాజలం ఈనెల 16న అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ముందుగా దాచిన ఇనుపపైపుతో లాకప్ గది, ట్రంకు పెట్టె తాళాలు పగులకొట్టి నగదు అపహరించాడు. అనుమానం రాకుండా వేరే లాకప్ గది తాళాన్ని ఈ లాకప్ గదికి వేశాడు. అలాగే ట్రంకు పెట్టెకు మరో తాళాన్ని వేశాడు. చోరీ సొత్తును వీరిద్దరూ పంచుకున్నారు. గణేష్ తన వా టా సొమ్మును వీరవాసరంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద పొదల్లో దాయగా, గంగాజలం గ్రామంలోని ప్రైవేటు కల్యాణ మండపం వద్దకు వచ్చి చెత్తలో డబ్బును దాచాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని సొమ్ము రికవరీ చేశారు. ఇద్దరిదీ నేర ప్రవృత్తే మొదటి నిందితుడిగా ఉన్న ఉసురుమర్తి గంగాజలానిది పోలవరం మండలం పాత పట్టిసీమ. 2013లో చాగల్లులో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. 2020లో పాతపట్టిసీమలోని గెస్ట్‌హౌస్‌లో పేకాట ఆడుతూ ప ట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇటీవల వీరవా సరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చాడు. రెండో నిందితుడు గొర్రెల గణేశ్వరరావుది నల్లజర్ల మండలం అనంతపల్లి. తాడేపల్లిగూడెంలో విధులు నిర్వహి స్తూ అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడు. గతేడాది నుంచి వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో విధు లు నిర్వహిస్తున్నాడు. ఇద్దరిపై శాఖాపరమైన విచారణ పూర్తి చేసి డిస్మిస్ చేస్తామని, డ్యూటీలో అలక్ష్యంగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌పై శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నారాయణనాయక్ చెప్పారు. ఏలూరు సీసీఎస్ డీఎస్పీ కె.పైడేశ్వరరావు ఆధ్వర్యంలో భీమవరం సీసీఎస్ ఇ న్స్పెక్టర్ నాగరాజు, తాడేపల్లిగూడెం సీఐ ఆకుల ర ఘు, వీరవాసరం, ఆచంట, పోడూరు, యలమంచి లి ఎస్సైలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ నారాయణనాయక్ చెప్పారు. చదవండి: హత్య కేసు: గుర్తు తెలిపిన తాళం చెవి! భర్త చేష్టలతో విసుగుచెంది... -
175వరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, భీమవరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 175వరోజు షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన వీరవాసరం నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి తలతాడితిప్ప, మెంతెపూడి క్రాస్, బొబ్బనపల్లి, మత్స్యపూరి మీదగా పాదయాత్ర కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం సీతారాంపురం క్రాస్, కొప్పర్రు వరకూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. 174వ రోజు ముగిసిన పాదయాత్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 174వ రోజు పాదయాత్ర వీరవాసరంలో ముగిసింది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇవాళ 11.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు జననేత 2181.7 కిలోమీటర్లు నడిచారు. -
ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం
సాక్షి, వీరవాసరం(పశ్చిమగోదావరి జిల్లా) : నరసాపురం - గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలుకు ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. వీరవాసరం చేరేసరికి ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. బ్రేక్ స్ట్రక్ అవడంతో ఇంజిన్ వద్ద పొగలు వచ్చాయని గుర్తించిన సిబ్బంది, పెన్నాడ వద్ద రైలును నిలిపి అరగంట పాటు మరమతులు చేశారు. తర్వాత రైలు బయలుదేరింది. గండం తప్పడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
ఉత్తమ ప్రదర్శనగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో చిలకమర్తి కళాప్రాంగణంలో గుండా లక్ష్మీరత్నావతి కళావేదికపై నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీల్లో ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచిందని నిర్వాహకులు గుండా రామకృష్ణ మంగళవారం తెలిపారు. కేబీఆర్ కల్చరల్ అసోసియేషన్ సికింద్రాబాద్ ప్రదర్శించిన ఈ నాటిక మానవతా విలువలు, బంధాలు, అనుబంధాలను వ్యక్తీకరించిందన్నారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా జనచైతన్య ఒంగోలు ప్రదర్శించిన ‘చేతిరాత’, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా కృష్ణా కల్చరల్ ఆర్ట్స్ గుడివాడ వారి ‘పితృదేవోభవ’ నాటికలు ఎంపికైనట్టు వెల్లడించారు. ఉత్తమ రచయితగా దిష్టిబొమ్మలు రచయిత ఎస్.వేంకటేశ్వరరావు, ఉత్తమ దర్శకుడిగా ఉదయ్భాగవతుల (ఎవరిని ఎవరు క్షమించాలి), ఉత్తమ నటుడిగా ఎల్.శంకర్ (చేతిరాత), ఉత్తమ నటిగా ఎల్.పద్మావతి (చేతిరాత), ఉత్తమ ప్రతినాయకుడిగా పి.నాగేశ్వరరావు (మధుర స్వప్నం), ఉత్తమ హాస్యనటుడిగా ఎన్ఎస్ఆర్వీ ప్రసాద్ (దిష్టిబొమ్మలు) నిలిచారు. న్యాయ నిర్ణేతలుగా తిరుమల కామేశ్వరరావు, విన్నకోట వేంకటేశ్వరరావులు వ్యవహరించారు. -
నాటక రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వీరవాసరం : నాటకరంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కోరారు. వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలభారత స్థాయి నాటిక పోటీల్లో పాల్గొని శనివారం ఆయన మాట్లాడారు. నాటకాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక అంశాలు ఎన్నో మిళితమై ఉంటాయన్నారు. నాటక ప్రదర్శనలకు థియేటర్లు ఏర్పాటు చేసి కళాకారులకు, కళాభిమానులను ప్రోత్సహించాలన్నారు. ఎంతో మంది కవులు, కళాకారులను, న్యాయ నిపుణులను ఏటా సన్మానించడం, నిర్విరామంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ లామ్ తాంతియాకుమారి, రిటైర్డ్ డెప్యూటీ హైకోర్టు రిజిస్ట్రార్ పాలకోడేటి కృష్ణమూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, వైసీపీ మండల కన్వీనర్ కోటిపల్లిబాబు, పట్టణాధ్యక్షుడు నూకల కనకారావు, ఎంపీటీసీలు చికిలే మంగతాయారు, రెడ్డి రాంబాబు, పాలా లక్ష్మీకుమారి, మోగంటి నాగేశ్వరరావు, ఆవాల కనకదుర్గ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కామన నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు పాల్గొన్నారు. -
ఇష్టంతో కష్టపడితే రాణింపు సాధ్యం
సినీ గాయని కౌసల్య వీరవాసరం : ఇష్టంతో కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని ప్రముఖ సినీ గాయని కౌసల్య అన్నారు. వీరవాసరం మండలం తోకలపూడిలో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సినీ సంగీత విభావరికి హాజరైన కౌసల్య బుధవారం రాత్రి ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ► మాది గుంటూరు. నాన్న ప్రభుత్వ కార్యాలయంలో యూడీసీ. ► చిన్నప్పటి నుంచి పాటలంటే చెవికోసుకునేదాన్ని. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సంగీతంలో పీజీ చేశాను. ► స్కూల్ స్థాయిలోనే ఎన్నో పాటలు పాడి అవార్డులు అందుకున్నాను. 1999లో ఆర్పీ పట్నాయక్ సంగీత సారథ్యంలో మీకోసం సినిమాలో తొలిసారి పాడాను. ► చిత్రం, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఆడదే ఆధారం, గోపిగోపిక గోదావరి, అమ్మనాన్న తమిళమ్మాయి, గంగోత్రి, శివమణి, కబడ్డీ కబడ్డీ, నువ్వే నువ్వే, డిక్టేటర్ చిత్రాలు మంచి పేరు తీసుకువ చ్చాయి. ► తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇప్పటివరకూ 500 పైగా పాటలు పాడాను. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ గొంతు కలిపాను. ► డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శ్రావణ మాసం, బకరా చిత్రాల్లో హీరోయిన్లకు గాత్రదానం చేశాను. ► సత్యభామ చిత్రంలోని ‘గుండెలోన..’ పాటకు 2007లో నంది అవార్డు తీసుకున్నాను. ఆడదే ఆధారం తెలుగు సీరియల్ టైటిల్ సాంగ్‌కు 2011లో మరోసారి నంది అవార్డు అందుకున్నాను. ► 2003లో అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, 2006లో శివమణి , 2009లో గోపి గోపిక గోదావరి చిత్రాల్లో బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా ఉగాది పురస్కారాలను పొందాను. ► ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాటలు పాడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. -
పంటకాలువలోకి దూసుకెళ్లిన బైక్: వ్యక్తి మృతి
వీరవాసరం (పశ్చిమ గోదావరి) : తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్తున్న వ్యక్తి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పంటకాలువలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం పోలేరుచింత గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. బంటుమిల్లికి చెందిన వేండ్ర వెంకటేశ్వర్లు(50) బైక్‌పై పొలం వద్దకు వెళ్తుండగా.. బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. -
కనులు లేవని.. కలత పడలేదు
వీరవాసరం, న్యూస్‌లైన్ : కనులు లేవని కలత చెందలేదు.. క్రమశిక్షణ , పట్టుదల, శ్రమించే తత్వం ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించాడు ఈ విద్యార్థి. స్నేహితుల సహకారానికి తన మేథస్సును జోడించి డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచాడు బీఎస్ రంగా అభిజిత్. వీరవాసరం ఎస్ఎంబీటీ ఏవీఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో బీఏ ఫైనలియర్ పూర్తిచేసిన అభిజిత్‌ను బుధవారం ‘న్యూస్‌లైన్’ పలకరించింది. అభిజిత్ మాట్లాడుతూ ‘మాది పాలకొల్లు. నాన్న సత్యజిత్ కుమార్ ఐన్జీ వైశ్యా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ కృష్ణ సుజాత గృహిణి, అన్నయ్య నాగ సత్యమంజిత్ బెంగుళూరులో సీఎ చ దువుతున్నాడు. టెన్త్ వరకు పాలకొల్లు బీఆర్ఎం స్కూల్లో, ఇంటర్ పాలకొల్లు ఛాంబర్స్ కాలేజీలో పూర్తి చేశాను. టెన్త్ చదువుతుండగా గ్లూకోమా వ్యాధి సోకడంతో కంటి చూపు కోల్పోయాను. కేరళలో రెండేళ్లు వైద్యం చేయించినా ఫలితం లేదు. చదువుపై ఉన్న ఆసక్తి, తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితుల సహకారంతో ఇక్కడిగా రాగలిగాను. అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ స్నేహితుల సహకారంతో బీఏ పరీక్షలు రాశాను. 1000 మార్కులకు 842 వచ్చాయి. కాలేజ్ టాపర్‌గా నిలిచారు. ఇందుకు స్నేహితులు, ఉపాధ్యాయలు సహకారం మరవలేనిది. సివిల్స్ విజేతగా నిలవాలన్నదే నా కోరిక’ అన్నారు. అభిజిత్‌ను కళాశాల సెక్రటరీ వర్థినీడి సత్యనారాయణ (బాబ్జీ), కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వీ రంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.