
సాక్షి, భీమవరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 175వరోజు షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన వీరవాసరం నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి తలతాడితిప్ప, మెంతెపూడి క్రాస్, బొబ్బనపల్లి, మత్స్యపూరి మీదగా పాదయాత్ర కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం సీతారాంపురం క్రాస్, కొప్పర్రు వరకూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు.
174వ రోజు ముగిసిన పాదయాత్ర
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 174వ రోజు పాదయాత్ర వీరవాసరంలో ముగిసింది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇవాళ 11.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు జననేత 2181.7 కిలోమీటర్లు నడిచారు.
Comments
Please login to add a commentAdd a comment