narsimharao
-
నటుడు దామరాజు కన్నుమూత
సాక్షి, ముషీరాబాద్ : సినీ, నాటక రంగాలతో పాటు బుల్లితెరపై కూడా తనదైన ముద్రవేసి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న నటుడు దామరాజు వెంకటలక్ష్మీ నర్సింహారావు (79) బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ప్రముఖ సినీ దర్శకుడు, నాటకరంగ పితామహుడు చాట్ల శ్రీరాములు శిష్యరికంలో ఎదిగిన నర్సింహారావును దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కూడా ప్రోత్సాహించారు. ఈ క్రమంలో దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం తాతా – మనవడు ద్వారా నర్సింహారావు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వారసురాలు, కలవారి కుటుంబం, మేనకోడలు, పోస్టుమేన్, కోరుకున్న ప్రియుడు, రాజా,అతడు (పాత చిత్రం)లో నటించారు. అనంతరం రుతురాగాలు, ఆనందధార, చదరంగం, అన్వేషిత, సంఘర్షణ తదితర సీరియల్లలో నటించి బుల్లితెరపై ఖ్యాతిగాంచారు. రచయితగా స్త్రీ రూపం, గాంధీ మళ్లీ పుడితే, స్వామియే శరణం, బసమ్మ కథ, ఇంకా రగులుతున్న రావణకాష్టం వంటి నాటకాలను అందించి, దర్శకత్వం కూడా వహించి రాణించారు. ప్రముఖ సినీ హీరో శివాజీ గణేశణ్ చేతుల మీదుగా నాటకరంగంలో ఉత్తమ కథనాయకుడిగా అవార్డులను అందుకున్నారు.ఉత్తమ నాటక రచయిత, ఉత్తమ హాస్యనటుడు అవార్డును 2007లో అందుకున్నారు. గాంధీ మళ్లీ పుడితే నాటకానికి ఉత్తమ దర్శకుడు అవార్డు పొందారు. ఒకవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కంటోన్మెంట్ డిపోలో అక్కౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తూనే ఇటు నటనలో కూడా తనదైన ముద్రవేశారు. పదవీ విరమణ తర్వాత వ్యవసాయ రంగంలోకి దిగి, పూర్తిగా సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను పండించారు.ఇందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2018లో ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు.నర్సింహారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
'కొడుకు కోడలు నుంచి విముక్తి కల్గించండి'
హైదరాబాద్: కొడుకు, కోడలు నుంచి విముక్తి కలిగించాలని వృద్ధ దంపతులు ఇంటి ముందు రెండు రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. కొత్తగూడలోని ప్రశాంత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కడలి రాందాసు(65) కొండాపూర్ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2010లో రిటైర్ అయ్యారు. ప్రశాంత్ నగర్లో 150 చదరపు గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు. రిటైర్ అయిన వెంటనే మరో రెండు అంతస్తుల ఇల్లు నిర్మించామని రాందాసు తెలిపారు. అందుకుగాను రూ.10 లక్షల వరకూ అప్పు చేయాల్సివచ్చిందని చెప్పారు. రెండంతస్తుల భవనంలో తల్లిదండ్రులు గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తుండగా.. మొదటి అంతస్తులో పెద్దకొడుకు సుబ్బారావు, కోడలు నాగలక్ష్మీ.. రెండో అంతస్తులో చిన్న కొడుకు నర్సింహారావు, కోడలు నాగ వరలక్ష్మీలు నివసిస్తున్నారు. అయితే పెద్ద కొడుకు ఆస్తి పంపకాలు చేయాలని గొడవపడటమే కాకుండా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి పోలీసుల ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. పెద్ద కోడలు, కొడుకుల నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. వారు ఇళ్లు వదిలి వెళ్లిపోయే వరకూ గేటు ముందే ఉంటామని తెలిపారు. మాకూ న్యాయం చేయండి: సుబ్బారావు మా తాత సంపాదించిన రెండు ఎకరాల పొలం అమ్మి వచ్చిన డబ్బులు, నా భార్య తెచ్చిన రెండు లక్షల కట్నం, 10 కాసుల బంగారంతో ఇళ్లు కట్టారని పెద్ద కొడుకు సుబ్బారావు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్నామని, పెన్షన్, ఇంటి అద్దెలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదన్నారు. -
ఉపాధ్యాయుడిని చితకబాదారు
ఖమ్మం: వైరా మండల పరిధిలోని ముసలిమడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌పై గురువారం దాడి జరిగింది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె. వెంకటేశ్వర్లు గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన నర్సింహారావు అనే వ్యక్తి టీచర్‌ను చితకబాదాడు. మధ్యాహ్నభోజనం వండే విషయంలో ఇటీవల జరిగిన వివాదమే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ వైర్లు తగిలి రైతు మృతి
గుంటూరు: పొలానికి వేసిన విద్యుత్ ఫెన్సింగ్ వైర్లు తగిలి రైతు దుర్మరణం చెందిన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బొల్లపల్లి మండలం పేరూరిపాడులో జరిగింది. పేరూరిపాడుకు చెందిన నర్సింహారావు రోజువారి పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఫెన్సింగ్‌కు వేసిన విద్యుత్ వైర్లు కాలికి తగిలి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. -
దేశ వ్యాప్తంగా వర్షపాతం 6 శాతం మాత్రమే
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 6 శాతం వర్షపాతం నమోదైందని, ఆగస్టు నెలలో 10 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు నర్సింహా రావు చెప్పారు. తెలంగాణలో సాధారణం కంటే 26 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని తెలిపారు. తెలంగాణ 10 జిల్లాలకు గానూ 7 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉందన్నారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 11 శాతం ఎక్కువ వర్షపాతమున్నా, నెల్లూరు జిల్లాలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైందని, మిగతా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసిందిని తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 12 శాతం తక్కువ వర్షపాతం ఉంటుందని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం ఏర్పడితేనే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు నర్సింహా రావు వివరించారు. -
ప్రొఫెసర్ దురుసు ప్రవర్తన
విశాఖపట్నం: తనకు సంబంధించిన బిల్లు తయారు చేయలేదనే కారణంతో ఓ ప్రొఫెసర్... నాన్ టీచింగ్ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో నాన్ టీచింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని ఆంధ్రా యునివర్శిటీ (ఏయూ) దూర విద్యా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...యూనివర్శిటీలో పని చేస్తున్న ప్రొ.రాజకుమార్ వ్యక్తిగత బిల్లు తయారు చేయాలని నాన్ టీచింగ్ ఉద్యోగి నర్సింహరావును కోరారు. బిల్లు తయారు చేయడంలో నర్సింహరావు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ విషయంపై మంగళవారం నర్సింహరావును ప్రొ.రాజకుమార్ నిలదీశారు. అయితే అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ప్రొ.రాజ్‌కుమార్... నర్సింహరావు పట్ల దురుసుగా ప్రవర్తించి, కొట్టినంత పని చేశారు. దీంతో ఆగ్రహించిన నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలిసి యూనివర్శిటీ టీచింగ్ స్టాఫ్ కూడా ఆందోళనకు దిగారు. దీంతో ఓ వర్గంపై మరో వర్గం వారు పోటాపోటీగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దూర విద్యాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ప్రొ. రాజ్‌కుమార్ వెంటనే సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం.