Naseem
-
ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు దిక్కులు
సాక్షి, ముంబై(మహరాష్ట్ర): బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు దిక్కుల వంటివని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. శనివారం తిరంగా యాత్ర బహిరంగ సభ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ ఆదివారం ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం కోటా గురించి ఎంఐఎం ఎందుకు నోరు విప్పలేదని ఆయన ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కోటా గురించి బాంబే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అప్పటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు. అప్పుడు తాము కోటా గురించి పోరాడుతుంటే ఎంఐఎం చడీ చప్పుడు లేకుండా ఉందన్నారు. తమ పార్టీ నాయకులు శాసన సభలో తమ గళాన్ని వినిపించినప్పుడు ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. అప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ప్రభుత్వానికి సహకరించారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడు బీజేపీకి మద్దతుగా ఉండేందుకే పనిచేస్తుందని ఆరోపించిన నసీమ్ ఖాన్.. అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలకు ఎన్నికల సమయంలో మాత్రమే ముస్లిం రిజర్వేషన్ల అంశం గుర్తుకు వస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వచ్చినందునే వారికి ఈ అంశం గుర్తుకు వచ్చిందన్నారు. ముస్లింలకు కోటా కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం నిజ స్వరూపమేంటో ముస్లింలు అందరికీ తెలుసని పేర్కొన్న నసీమ్ ఖాన్.. ముస్లింల కోసం ఒవైసీ, ఎంఐఎం పార్టీ ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: మిస్ యూనివర్స్‌గా భారత యువతి -
Video: ఈ నటుడి డెడికేషన్‌కి హ్యాట్సాఫ్.. మామూలు కష్టం కాదు!
తెరపై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఆడియెన్స్-వ్యూయర్స్‌పై ఎంత ఇంపాక్ట్ చూపించామన్నది ముఖ్యం. ఫ్యామిలీ మ్యాన్ ‘చెల్లం’సర్ లాంటి కొన్ని క్యారెక్టర్లు ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా అలాంటి ఇంపాక్ట్ చూపించిన మరో క్యారెక్టర్.. డ్యాన్సింగ్ రోజ్. పా రంజిత్ డైరెక్షన్లో అమెజాన్ ప్రైమ్‌లో లేటెస్ట్గా రిలీజ్ అయ్యింది ‘సార్పట్ట పరంపర’(సార్పట్ట పరంబరై). ఈ సినిమాలో ఈ ‘డ్యాన్సింగ్ రోజ్’ అనే క్యారెక్టర్‌కి ప్రాధాన్యత పదిహేను నిమిషాలు ఉంటుంది. కానీ, ఆ క్యారెక్టర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు పా రంజిత్. స్లిమ్ ఫిట్ బాడీ, నుదుట రింగు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ వేసే స్టెప్పులు. రింగ్‌లో ఊగిపోతూ ఓడిపోతున్నట్లుగా ప్రత్యర్థులను భ్రమపెట్టి, కాళ్ల వేగంతో కన్ఫ్యూజ్ చేసి బాక్సింగ్‌లో గెలుపు సాధించే క్యారెక్టర్ డ్యాన్సింగ్ రోజ్‌ది. అయితే డ్యాన్సింగ్ రోజ్కి ఓ క్యారెక్టర్ అంటూ ఉంటుంది. సమర(కబిలన్)తో ఓడినప్పటికీ, విలన్ బ్యాచ్‌లో ఉన్నప్పటికీ.. నీతి తప్పడు. పైగా క్లైమాక్స్ పోటీకి ముందు వేటపులి(వేంబులి)కి హితబోధ కూడా చేస్తాడు. అందుకే చాలామందికి ఈ పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. ఇంతకీ ఈ క్యారెక్టర్ చేసింది ఎవరంటే.. చెన్నై థియేటర్ ఆర్టిస్ట్ షబీర్ కళ్ళరక్కల్. మాంచి థియేటర్ ఆర్టిస్ట్ 2009 నుంచి నటన వైపు అడుగులేశాడు నటుడు షబీర్ కళ్ళరక్కల్. యాభైకి పైగా స్టేజ్ షోలతో థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆపై ‘నెరుంగి వా ముథమిడతే’(2014) హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు షబీర్. కానీ, ఆ తర్వాత అవకాశాలే పెద్దగా రాలేదు. దీంతో ‘అడంగ మరు, పెట్టా, టెడ్డీ’ లాంటి పెద్దసినిమాల్లో చిన్నరోల్స్ చేశాడు. షబీర్ స్వతహాగా ఫిట్నెస్ ప్రియుడు. దీంతో కాస్టింగ్ డైరెక్టర్ నిత్య.. సార్పట్ట అడిషన్స్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. అలా క్యారెక్టర్ దక్కింది. ఫిట్నెస్ ఉన్నోడు కావడంతో మార్షల్ ఆర్ట్స్ కళలో శిక్షణ తీసుకోగలిగాడు. స్టంట్ మాస్టర్ తిరు నేతృత్వంలో.. రకరకాల కళలను సులువుగా అవపోసన పట్టగలిగాడు. అంత కష్టపడ్డాడు గనుకే డ్యాన్సింగ్ రోజ్ సీక్వెన్స్‌లన్నీ అంతగా పేలాయి. ఇక అతను పడ్డ కష్టం తాలుకా వీడియోను చూసేయండి. Shabeer Kallarakkal aka DANCING ROSE. pic.twitter.com/aCUSdfJwSN — LetsOTT GLOBAL (@LetsOTT) July 22, 2021 అన్నట్లు డ్యాన్సింగ్ రోజ్‌కు ఇన్స్పిరేషన్.. యూకే బాక్సింగ్ లెజెండ్ నసీమ్ హమెద్. ఆయన ఎంట్రీ దగ్గరి నుంచి రింగ్‌లో కదలికల దాకా అంతా విచిత్రంగా ఉంటుంది. 1992-2002 మధ్య ప్రొఫెసనల్ బాక్సర్‌గా కొనసాగిన నసీమ్.. 37 ఫైటింగ్ల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయాడు. ఐదున్నర అడుగుల ఎత్తుండే ప్రిన్స్.. క్యారెక్టర్ స్ఫూర్తితో జపనీస్ మాంగా సిరీస్ ‘హజెమె నో ఇప్పో’లో అమెరికన్ బాక్సింగ్ ఛాంపియన్ బ్రయాన్ హక్ క్యారెక్టర్‌ను సైతం తీర్చిదిద్దారు. -
ఢిల్లీ ఎన్నికలకు నగారా
వచ్చేనెల 7న అసెంబ్లీ ఎన్నికలు 13న తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపింది. సోమవారమిక్కడ కమిషనర్లు హెచ్ఎస్ బ్రహ్మ, నసీమ్ జైదీలతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఢిల్లీలో 1.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎన్నికలు లేకపోవడంతో ఢిల్లీ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు తమ దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీ కిందటేడాది నవంబర్ 4న రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన గడువు ఫిబ్రవరి 15న ముగియనుంది. ఎన్నికల కోసం 11,736 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ , కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి అసెంబ్లీ స్థానం సహా వివిధ రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమబెంగాల్లోని బంగోన్ లోక్‌సభ స్థానానికి కూడా ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహిస్తామని వీఎస్ సంపత్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ జారీ చేసిన పలు ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి సంతకం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘తన రాజ్యాంగ అధికారాలను ఎప్పుడు వాడాలో ఆయన(రాష్ట్రపతి)కు తెలుసు’ అని సంపత్ పేర్కొన్నారు. వ్యూహ రచనల్లో పార్టీలు.. షెడ్యూల్‌కు ముందే ఢిల్లీలోని ప్రధాన పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ వ్యూహ రచనల్లో మునిగితేలుతున్నాయి. ఆప్ ఇప్పటికే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు పోస్టర్లు, హోర్డింగులు, ఎస్ఎంఎస్లు, రేడియో సందేశాలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తోంది. గడిచిన రెండు నెలల్లో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 55 సభలు నిర్వహించారు. విద్యుత్తు చార్జీలను తగ్గిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. తమ 49 రోజుల పాలనలోని విజయాలను ప్రధానంగా పేర్కొంటూ ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇక ప్రధాని మోదీ ప్రభంజనమే తమను గెలిపిస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగరంలో బీజేపీ శ్రేణులు మోదీ పోస్టర్లు, హోర్డింగులను పెద్దఎత్తున ఏర్పాటు చేశా యి. ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ర్యాలీ నిర్వహించిన మోదీ.. మరో ఐదారు సభలకు హాజరవుతారని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా మునుపెన్నడూ లేని రీతి లో ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. త్వరలోనే రెండో జాబితా విడుదల చేయనుంది. అయితే ప్రచారపరంగా ప్రత్యర్థి పార్టీల కన్నా వెనుకబడి ఉంది. ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది.