జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తా
ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్లో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. అండర్–17 బాలుర విభాగంలో భరత్ రింక్–1లో ప్రథమస్థానం, రోడ్లో –1లో ద్వితీయస్థానంలో నిలిచాడు. భూషణ్ రింక్–4 విభాగంలో ద్వితీయస్థానం, రింక్–5లో తృతీయస్థానం, రోడ్–2లోనూ తృతీయస్థానంలో నిలిచాడు. అండర్–17 విభాగంలో భరత్, భూషణ్ జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. విశాలాక్షి రింక్–1లో తృతీయస్థానం, హరిచంద్ర ప్రసాద్ రింక్–1లో తృతీయస్థానంలో నిలినట్లు సర్దార్ పటేల్ స్టేడియం స్కేటింగ్ శిక్షకుడు కె.సురేష్ తెలిపారు.