చెస్ పోటీల్లో బంగారు పతకం
తిరుపతి ఎడ్యుకేషన్ : భువనేశ్వర్‌లో ఈ నెల 23నుంచి 27వ తేదీ వరకు జరిగిన 47వ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ జాతీయ చెస్ క్రీడా పోటీల్లో తిరుపతి విద్యార్థి ప్రథమస్థానం కైవసం చేసుకుని బంగారు పతకం సాధించాడు. తిరుపతి చెన్నారెడ్డికాలనీలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాల 6వ తరగతి విద్యార్థి కె.శ్యాంప్రసాద్‌రెడ్డి అండర్–14విభాగంలో పాల్గొన్నాడు. మొదటి నుంచి అపార క్రీడా ప్రతిభ చాటి ప్రథమ స్థానం కైవసం చేసుకుని బంగారు పతకాన్ని సాధించాడు. అక్టోబర్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ సీహెచ్.ప్రసాదరావు, పీఈటీ జీ.శేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందనందించారు.