National Geographic Award
-
‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్’.. 5 వేల ఫోటోలను దాటి విజేతగా నిలిచింది
నేషనల్ జియోగ్రాఫిక్ ‘పిక్చర్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో విజేతగా నిలిచిన చిత్రమిది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్, ఫోటోగ్రాఫర్ కార్తీక్ సుబ్రమణియన్ ఈ ఫోటో తీశారు. అలాస్కాలోని చిల్కాట్ బాల్డ్ ఈగల్ అభయారణ్యంలో తీసిన ఈ ఫోటోకు ‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్’ అని పేరు పెట్టారు. ప్రకృతి, ప్రజలు, ప్రాంతాలు, ప్రాణులు కేటగిరీలో వచ్చిన 5000 ఫోటోల్లోంచి చివరికి దీన్ని ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ పోటీలో గుర్తింపు పొందిన కొన్ని ఫోటోలుపై ఓ లుక్కేద్దాం. -
భారత సంతతి విద్యార్థికి నేషనల్ జాగ్రఫిక్ అవార్డు
వాషింగ్టన్: అమెరికాలో అఖిల్ రేకులపల్లి (13) అనే భారత సంతతికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రతిష్టాత్మకమైన నేషనల్ జాగ్రఫిక్ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద 50వేల డాలర్ల స్కాలర్షిప్ కూడా లభించింది. వర్జీనియాలో నివసించే అఖిల్ నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ నిర్వహించిన జాతీయస్థాయి క్విజ్ పోటీలో మరో భారత సంతతి విద్యార్థి అమేయ మజుందార్‌ను ఓడించి ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. బుధవారం వాషింగ్టన్లో జరిగిన చివరి రౌండ్లో పదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. అమెరికా వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో జరిగిన పోటీలో సుమారు 40 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు నేషనల్ జాగ్రఫిక్ సంస్థ తెలిపింది. వివిధ వార్తాచానళ్లను చూడడం ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నానని, పోటీలో గెలవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడిందని అఖిల్ చెప్పాడు. ఈ పోటీకోసం అఖిల్ ఓ కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాగా, రెండో స్థానంలో నిలిచిన 11 ఏళ్ల అమేయ మజుందార్‌కు 25 డాలర్ల స్కాలర్షిప్ లభించింది.