national health schemes
-
కాఫీ తాగడం మంచిదా..? కాదా..?
ఉదయాన్నే కాఫీ తాగందే కొంతమందికి ఏమి తోచదు. మరికొంతమందికి కాస్తంత కాఫీ, అలసిన శరీరానికి ఓ టానిక్ లా పనిచేస్తుంది. ఇంకొందరికి కాఫీ అంటే ఇష్టంతో.. కప్పుల మీద కప్పుల కాఫీ తాగేస్తుంటారు. మరి కాఫీ తాగడం మంచిదా? కాదా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికే.. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సైంటిస్టులు మానవ శరీరంపై కాఫీ ప్రభావం గురించి పరిశోధన చేపట్టారు. దాదాపు 200కు పైగా గణాంకాలు సేకరించారు. కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాదు, క్యాన్సర్‌తో పాటు కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గాయని వెల్లడించారు. అయితే యూకే ’జాతీయ ఆరోగ్య పథకం’ (ఎన్హెచ్ఎస్) ప్రకారం.. గర్భిణులు రోజుకు 200 మిల్లీ గ్రాము కన్నా ఎక్కువగా, అంటే రెండు మగ్గుల ఇన్స్టెంట్ కాఫీ కన్నా ఎక్కువ తీసుకుంటే వారికి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని సూచించారు. కాఫీపై జరిపిన పరిశోధనల్లో రోజుకు 400 మి.గ్రా. లేదా అంతకన్నా తక్కువ కెఫీన్ – లేదా 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగితే ఎలాంటి ముప్పూ లేదని తేలింది. పరిమితంగా కాఫీ సేవించడం సురక్షితమే. -
మన కోవిడ్ వీరులను వెతకండి!
సాక్షి, ఢిల్లీ : చైనాలో కరోనా వైరస్ మహమ్మారి ముప్పు గురించి ముందుగానే అధికారులను హెచ్చరించడంతో పాటు కరోనా సోకిన అనేక మంది రోగులకు వైద్యం చేస్తూ కన్ను మూసిన ఆప్తమాలోజిస్ట్ లీ వెన్లియాంగ్ పేరు చైనా నలుమూలలా ప్రతిధ్వనిస్తోంది. డాక్టర్ ఆంథోని ఫాస్సీ పేరు కూడా నేడు అమెరికా అంతా మారుమ్రోగుతుంది. ఇక కరోనా కట్టడికి అవిశ్రాంత పోరు జరపుతోన్న బ్రిటన్ ‘నేషనల్ హెల్త్ స్కీమ్’ మొత్తం ఓ హీరోగా నీరాజనాలందుకుంటోంది. (కరోనా కట్టడిలో ఢిల్లీ సక్సెస్ అయిందా? ఎలా?) ఇలాగా ప్రశంసలు అందుకోవాల్సిన వారు భారత్‌లో లేకపోలేదు. వైద్య సేవల నుంచి పారిశుద్ధ్య సేవల వరకు, ఎన్జీవోల నుంచి శ్మశాన క్రియల వరకు కరోనాకు ప్రాణాలొడ్డి సేవలందిస్తోన్న హీరోలు భారత్‌లో ఎక్కువగా ఉండి ఉంటారని, అలాంటి వారిని మీడియా వెతికి పట్టుకొని వారిని హీరోలుగా ఆవిష్కరించాలని ముంబైలోని టాటామొమోరియల్ సెంటర్లో రేడియాలజి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న డాక్టర్ అక్షయ్ బహేటి పిలుపునిచ్చారు. రోజుకు ఇన్ని కేసులు పెరుగుతున్నాయంటూ ప్రజలను అనవసరంగా భయాందోళనలకు గురిచేస్తోన్న టీవీ మీడియా కోవిడ్ హీరోలపై కథనాలను ప్రసారం చేయాలని ఆయన సూచించారు. నేడు దేశంలో కోవిడ్ కారణంగా కాకుండా కోవిడ్ సోకిందనే భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని, వారందరిలో ధైర్యాన్ని నింపాల్పింది బాధ్యత కూడా టీవీలదేనని ఆయన చెప్నారు. -
వైద్యారోగ్య శాఖలో భారీగా వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. జాతీయ ఆరోగ్య పథకం (ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం, ఎన్యూహెచ్ఎం)లో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలు, ఏఎన్ఎంలు , స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, కాంట్రాక్టు డాక్టర్లు, ఆశా వర్కర్లకు వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. స్టాఫ్ నర్సు రూ.8,100, ల్యాబ్ టెక్నీషియన్ రూ.7,000, ఫార్మాసిస్టు రూ.11,000, ఏఎన్ఎం రూ.10,500, రెండో ఏఎన్ఎం రూ.8,350, మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్) రూ.5,350, మెడికల్ ఆఫీసర్ (ఆయూష్) రూ.9,532 మెడికల్ ఆఫీసర్ (ఆయూష్, ఆర్బీఎస్కే) రూ.11,900 చొప్పున వేతనాలు పెంచారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7,500 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో రెండో ఏఎన్ఎంల వేతనం రూ.21 వేలకు చేరింది. వైద్యారోగ్య శాఖలో 2000 సంవత్సరం నుంచి రెండో ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్స్, ప్రోగ్రాం ఆఫీసర్లు, అకౌంటెంట్లు, సహాయ సిబ్బంది వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమకు కనీస వేతనాలను అమలు చేయాలని వారు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరి కోరిక మేరకు వేతనాలు పెంచుతూ ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలతో ప్రభుత్వంపై ఏటా రూ.92.82 కోట్ల భారం పడనుంది. తమ ఆవేదనను అర్థం చేసుకొని..వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు తమ కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఆయుష్మాన్’కు ఆధార్ తప్పనిసరి కాదు
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం – ఆయుష్మాన్ భారత్‌కు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. పథకానికి ఆధార్ తప్పనిసరి మాత్రం కాదని స్పష్టం చేసింది. జాతీయ ఆరోగ్య బీమా పథకంలో భాగంగా లబ్ధిదారులు ఆధార్‌ను తప్పనిసరిగా చూపించాల్సిందేనంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సరైన లబ్ధిదారులను గుర్తించే విషయంలో ఆధార్ కార్డును చూపించాలి. ఇది తప్పనిసరేం కాదు. ఆధార్ లేదంటూ లబ్ధిదారుడికి చికిత్సను తిరస్కరించడం జరగదు’ అని కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. ‘ఆధార్ కార్డులతో సంబంధం లేకుండా అందరు లబ్ధిదారులకు మేం సేవలందిస్తాం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. -
మోదీ కేర్’కు నిలేకనీ సాయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకానికి(ఎన్‌హెచ్‌పీఎస్) అవసరమయ్యే సాంకేతిక వనరుల(ఐటీ) కల్పనలో సాయానికి ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకనీ అంగీకరించారని నీతి ఆయోగ్ తెలిపింది. మోదీ కేర్‌గా పిలుస్తున్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆధార్ తరహాలోనే ఎన్‌హెచ్‌పీఎస్ పథకానికి కూడా భారీ స్థాయిలో ఐటీ సేవలు అవసరమని, ఆ నేపథ్యంలో ఆధార్ జారీ వ్యవస్థ యూఐడీఐఏ మాజీ చైర్మన్ నిలేకనీని సంప్రదించామని నీతి ఆయోగ్ అధికారి ఒకరు తెలిపారు. -
దండిగా డబ్బు.. అయినా ఏపీలో జబ్బు!
రాష్ట్రంలో కుంటుబడుతున్న జాతీయ ఆరోగ్య పథకాలు రోగుల చికిత్స, ఔషధాలు, టీకాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా ఇచ్చిన కేంద్రం కేంద్ర నిధులు దండిగా ఉన్నా ఖర్చుచేయని రాష్ట్రం రాష్ట్ర వాటా నిధులకూ దిక్కులేని వైనం ఖర్చు చేయని నిధులు రూ.249 కోట్లు.. మార్చి 31తో వెనక్కి! సంచార వైద్య యూనిట్లకు రూ.2.58 కోట్లున్నా.. ఒక్క రూపాయీ వెచ్చించని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రుల వరకు ఏ ఆస్పత్రిలోనూ రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వివిధ ఆరోగ్య పథకాలకుగాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆయా నిధులను సరిగా వినియోగించలేదు. ఫలితంగా ప్రజారోగ్యం మూలనబడుతోంది. విభజనానంతరం ఏపీలో ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు పూర్తవుతున్నా.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏ ఒక్క పథకమూ అమలుకు నోచుకోలేదు. ఈ మిషన్ కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.1,044 కోట్లు నిధులు అందాయి. దీనిలో 25 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా జోడించి మొత్తం 32 కేంద్ర ఆరోగ్య పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జోడించాల్సిన నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో(అంటే.. ఈ ఏడాది మార్చి 31నాటికి) ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దాదాపు రూ.249 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మాతా శిశు సంరక్షణ ‘వధ’ రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మరణాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం.. వాటికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని సూచించింది. దీనికిగాను సుమారు రూ.400 కోట్లు కేటాయించింది. అయితే, గడిచిన 9 మాసాల్లో రూ.200 కోట్లను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇప్పటికీ ఏటా 600 మందికి పైగా తల్లులు మరణిస్తుంటే, 35 వేల మందికి పైగా శిశువులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వరుసలో.. రాష్ట్రీయ బాల సురక్షా కార్యక్రమం, శిశు ఆరోగ్యం, పల్స్‌పోలియో, ప్రధాన ఆస్పత్రుల బలోపేతం, వైద్యసిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు వంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో కుంటుపడ్డాయి. డబ్బుండీ.. దరిద్రమే! # వివిధ జిల్లాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మించాలని రూ.24 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకూ స్థల సేకరణ కూడా చేయలేదు. దీనివల్ల మారుమూల గ్రామీణ ప్రజలకు వైద్యం గగనంగా మారింది. # అన్ని ఆస్పత్రుల్లోనూ డయాగ్నొస్టిక్స్(వైద్య పరీక్షలు) ఉచి తంగా చేసేందుకు రూ.60 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వర కూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇప్పటికీ అనేక ప్రాం తాల్లో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లిన రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే రక్తపరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. # ఉచిత మందులకు రూ.60 కోట్లు కేటాయిస్తే.. 90 శాతం ఆస్పత్రుల్లో ఇప్పటికీ చిట్టీలు రాసి.. బయట కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాణాధార మందులైన కేన్సర్, హీమోఫీలియా వంటి జబ్బులకు సంబంధించిన ఔషధాలను కూడా బయటే కొనుక్కోవాలని రోగులకు సూచిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కనీసం 50 రకాల మందులతో పాటు 17 రకాల రక్తపరీక్షలు జరగాలి. కానీ అలా జరగడం లేదు. # సంచార వైద్య యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. ఫలితంగా రహదారి ప్రమాదాల్లో గాయపడుతున్న వారికి, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి వైద్యాన్ని చేరువ చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించాలని కేంద్రం భావించింది. దీనికిగాను రూ. 2.58 కోట్లను రాష్ట్రానికి ఇచ్చింది. అయితే, దీనిలో రూ. ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు.