సాక్షి, ఢిల్లీ : చైనాలో కరోనా వైరస్ మహమ్మారి ముప్పు గురించి ముందుగానే అధికారులను హెచ్చరించడంతో పాటు కరోనా సోకిన అనేక మంది రోగులకు వైద్యం చేస్తూ కన్ను మూసిన ఆప్తమాలోజిస్ట్ లీ వెన్‌లియాంగ్ పేరు చైనా నలుమూలలా ప్రతిధ్వనిస్తోంది. డాక్టర్ ఆంథోని ఫాస్సీ పేరు కూడా నేడు అమెరికా అంతా మారుమ్రోగుతుంది. ఇక కరోనా కట్టడికి అవిశ్రాంత పోరు జరపుతోన్న బ్రిటన్ ‘నేషనల్ హెల్త్ స్కీమ్’ మొత్తం ఓ హీరోగా నీరాజనాలందుకుంటోంది. (కరోనా కట్టడిలో ఢిల్లీ సక్సెస్ అయిందా? ఎలా?)
ఇలాగా ప్రశంసలు అందుకోవాల్సిన వారు భారత్‌లో లేకపోలేదు. వైద్య సేవల నుంచి పారిశుద్ధ్య సేవల వరకు, ఎన్‌జీవోల నుంచి శ్మశాన క్రియల వరకు కరోనాకు ప్రాణాలొడ్డి సేవలందిస్తోన్న హీరోలు భారత్‌లో ఎక్కువగా ఉండి ఉంటారని, అలాంటి వారిని మీడియా వెతికి పట్టుకొని వారిని హీరోలుగా ఆవిష్కరించాలని ముంబైలోని టాటామొమోరియల్ సెంటర్‌లో రేడియాలజి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న డాక్టర్ అక్షయ్ బహేటి పిలుపునిచ్చారు.
రోజుకు ఇన్ని కేసులు పెరుగుతున్నాయంటూ ప్రజలను అనవసరంగా భయాందోళనలకు గురిచేస్తోన్న టీవీ మీడియా కోవిడ్ హీరోలపై కథనాలను ప్రసారం చేయాలని ఆయన సూచించారు. నేడు దేశంలో కోవిడ్ కారణంగా కాకుండా కోవిడ్ సోకిందనే భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని, వారందరిలో ధైర్యాన్ని నింపాల్పింది బాధ్యత కూడా టీవీలదేనని ఆయన చెప్నారు.
Comments
Please login to add a commentAdd a comment