National insurance
-
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం నిధులు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం మరిన్ని నిధులు సమకూర్చనుంది. వాటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు ఇది తప్పనిసరి అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.5,000 కోట్ల నిధులను సమకూర్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా, నియంత్రణపరమైన నిధుల అవసరాలను చేరుకునేందుకు వీలుగా వీటికి ఎంత మేర సమకూర్చాలనే దానిపై ఆర్థిక శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుందని సదరు అధికారి తెలిపారు. వాటి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యంగా లేదని, సాల్వెన్సీ మార్జిన్ పెంచేందుకు నిధుల సాయం అవసరమని చెప్పారు. కంపెనీలు తమకు వచ్చే క్లెయిమ్‌లకు చెల్లింపులు చేస్తుంటాయని తెలిసిందే. ఈ చెల్లింపులకు మించి నిధులను బీమా సంస్థలు కలిగి ఉండడాన్ని సాల్వెన్సీ మార్జిన్‌గా చెబుతారు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం కనీసం 1.5 సాల్వెన్సీ మార్జిన్ అయినా ఉండాలి. -
జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌యు) జనరల్ ఇన్స్యూరెన్స్ లో పనిచేసే ఉద్యోగులు చివరకు రాబోయే కొద్ది రోజుల్లో 15 శాతం వేతన సవరణ జరిగే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. 60 వేల మంది పిఎస్‌యు ఉద్యోగులకు వేతనాల సవరణలు 2021లో జరగనున్నాయి. అంటే రాబోయే రోజుల్లో వీరికి గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. వేతన సవరణ సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు చివరిసారిగా 2017లో వేతన సవరణ జరిగింది. అందువల్ల, వేలాది మంది ఉద్యోగులు తమ వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల, జీఐపీఎస్‌ఏ ఛైర్మన్, న్యూ ఇండియా అస్యూరెన్స్ సీఎండీ అతుల్ సహాయ్ మాట్లాడుతూ.. " వేతన సవరణ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది. డిసెంబర్లో ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. కానీ, ఉద్యోగులు బకాయిల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన ఉద్యోగుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారని నివేదిక తెలిపింది. ప్రస్తుతం సాధారణ బీమా రంగంలో నాలుగు పిఎస్‌యులు ఉన్నాయి. అని నేషనల్ ఇన్స్యూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్. 60,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలలో పనిచేస్తున్నారు. నాలుగు సంస్థలలో న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, ఇది ఒకటి మాత్రమే మంచి ఆర్థిక స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. మార్కెట్ వాటా తగ్గడం, ప్రైవేట్ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా మిగిలిన బీమా కంపెనీలు ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోతున్నాయి. (చదవండి: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్!) -
రాణించిన భార్గవానంద్, వెల్‌ఫ్రెడ్
జింఖానా, న్యూస్‌లైన్: పోస్టల్ జట్టు బౌలర్లు భార్గవానంద్ (5/17), లెస్లీ వెల్‌ఫ్రెడ్ (4/18) చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఎఫ్‌సీఐ జట్టుపై గెలుపొందింది. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎఫ్‌సీఐ 68 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ రెండే వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. చంద్రకాంత్ 30 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో ఇండియన్ ఎయిర్‌లై న్స్ జట్టు 5 వికెట్ల తేడాతో నేషనల్ ఇన్సూరెన్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన నేషనల్ ఇన్సూరెన్స్ 101 పరుగులకే చేతులెత్తేసింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ బౌలర్లు సత్యనారాయణ 4 వికెట్లు తీసుకోగా... ప్రభు కిరణ్, సతీష్ కుమార్ తలా మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నేషనల్ ఇన్సూరెన్స్ 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. దీపక్ (37 నాటౌట్), జతిన్ మెహతా (34) మెరుగ్గా ఆడారు. నేషనల్ ఇన్సూరెన్స్ బౌలర్ సిద్ధు 3 వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్‌లో వీఎస్టీ జట్టు 3 వికెట్ల తేడాతో ఏపీ హైకోర్ట్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. మొదట వీఎస్టీ 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. పాల్ సింగ్ 33 పరుగులు చేశాడు. ఏపీ హైకోర్ట్ బౌలర్ విజయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఏపీ హైకోర్ట్ 7 వికెట్లకు 108 పరుగులు చేసింది. పండరీనాథ్ (43) ఫర్వాలేదనిపించాడు. వీఎస్టీ బౌలర్ అనీసుద్దీన్ 3 వికెట్లు పడ గొట్టాడు.