రైలు ప్రమాదాలపై విద్రోహ కోణంలో దర్యాప్తు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని కూనేరు, ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో ఇటీవల సంభవించిన రైలు ప్రమాదాల్లో ఉగ్రవాదుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే దిశలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) విచారణ జరపనుంది. కేంద్ర హోం శాఖ ఆదేశాలమేరకు ఎన్ఐఏ దర్యాప్తు బాధ్యతలు చేపట్టినట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
ఇటీవల హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన విజయనగరం సమీపంలోని కూనేరును ఎన్ఐఏ బృందం ఇప్పటికే సందర్శించింది. ఈ నెల 21న జరిగిన ఈ ప్రమాదంలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. అదే విధంగా గతేడాది నవంబర్ 20న ఇండోర్–పట్నా రైలు కాన్పూర్ వద్ద పట్టాలు తప్పిన ఘటనలో సుమారు 150 మంది మరణించారు.