National Investigation Team (NIA)
-
‘కశ్మీర్ ఉగ్ర సాయం’పై ఎన్ఐఏ కన్ను
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసేందుకు భద్రతా సంస్థలు చర్యలు ప్రారంభించాయి.కశ్మీర్‌కు చెందిన వ్యాపారి జహూర్ అహద్ షా వతాలీకి చెందిన 10 స్థిరాస్తులతోపాటు హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సలాహుద్దీన్‌కు ఇస్లామాబాద్‌లో ఉన్న నివాసం ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఆదాయ పన్ను శాఖ ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి చర్యలు చేపట్టనున్నాయి. ఉగ్ర సంస్థలకు సాయం అందించారన్న కేసులో వతాలీ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. పాక్‌కు చెందిన ఐఎస్ఐ సూచనల మేరకు ఉగ్రవాద సంస్థలకు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాహుద్దీన్ సహా, హురియత్ నేతలు, వ్యాపారవేత్తలైన 13 మందిని ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. వీరి ద్వారా కశ్మీర్లో ఉగ్రవాదుల చేరికలు, శిక్షణ, పేలుడు సామగ్రి, ఆయుధాలు సమకూర్చడం, అల్లర్లకు పాల్పడే వారికి ఆర్థిక సాయం అందించడం వంటివి జరుగుతున్నాయని ఎన్ఐఏ తేల్చింది. కశ్మీర్ యువతను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించడంలో ఈ 13 మంది కీలకంగా ఉన్నట్లు గుర్తించింది. -
వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే
-
పాతబస్తీలో మళ్లీ ఎన్ఐఏ సోదాలు
- ఉగ్రమూకలు వెల్లడించిన సమాచారం ఆధారంగా సోదాలు - కంప్యూటర్లు, స్కానర్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ - నాందేడ్‌లో సీసీ కెమెరాలకు చిక్కకుండా రాత్రుళ్లు సంచారం - ఇబ్రహీంకు షఫీ ఆర్మర్‌ను పరిచయం చేసిన వారిపై ఆరా - గతంలో పట్టుబడిన సానుభూతిపరుల విచారణ సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం మళ్లీ సోదాలు నిర్వహించారు. బార్కాస్, తలాబ్కట్టల్లో మూడు బృందాలుగా నిర్వహించిన ఈ సోదాల్లో 17 బుల్లెట్లు, రెండు స్కానర్లు, రెండు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఉదంతంలో ఎన్ఐఏ ఇప్పటికే ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులను అరెస్టు చేయడం తెలిసిందే. దర్యాప్తులో ఐదు రోజులుగా వారు వెల్లడించిన అంశాల మేరకు ఎన్ఐఏ మళ్లీ సోదాలు నిర్వహించింది. తాలాబ్కట్టలోని ఇబ్రహీం నివాసంపై దాడి చేసి కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టున్న హబీబ్ నివాసంలో కంప్యూటర్‌తో పాటు 9 ఎంఎంకు చెందిన 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కంప్యూటర్ ద్వారానే హబీబ్ తరచూ ఐసిస్ ముఖ్య నేత షఫీ ఆర్మర్‌తో మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు. ఇబ్రహీం బావమరిదికి చెందిన షాలిమార్ మీసేవా కేంద్రంలోని మరో కంప్యూటర్, స్కానర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్‌లో ఆధారాలు మాయం ఉగ్రమూకలు తమ కుట్రను గుట్టుగా ఉంచేందుకు వీలైనంత వరకు రాత్రుళ్లలోనే పని చేసుకుపోయినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఐదుగురు ముఠా సభ్యులు తరచూ రాత్రిళ్లే సమావేశమయ్యేవారని ఉగ్ర సానుభూతిపరులు విచారణలో వెల్లడించారు. ఆయుధాల కోసం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటన కూడా పూర్తిగా రాత్రుళ్లే జరిగింది. విచారణలో భాగంగా అధికారులు వారిని నాందేడ్ తీసుకెళ్లి, వారు తిరిగిన ప్రాంతాలను పరిశీలించారు. చీకట్లో ముసుగులతో ఉన్న వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పైగా నాందేడ్‌లో ఇబ్రహీం యజ్దానీ కలిసిన వ్యక్తులు పరారైనట్టు తెలిసింది. గతంలో పట్టుబడ్డవారితో సంబంధాలు? వరుస పేలుళ్లకు కుట్ర పన్నారని ఎన్ఐఏ అనుమానిస్తున్న ఉగ్రముఠా సభ్యులంతా కొత్తవారే. మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ అలియాస్ ఇబుతో పాటు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్, అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఆమోదీ అలియాస్ ఫహాద్‌లను అన్సరుల్ తవ్హిద్ పి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)లో చేర్చిందెవరనే విషయంపై ఎన్ఐఏ లోతుగా ఆరా తీస్తోం ది. సిరియాలోని ఐసిస్ ముఖ్యనేత షఫీ ఆర్మర్‌ను వీరికి పరిచయం చేసిందెవరనే విషయం లో అధికారులకు స్పష్టత రావడంలేదు. గత సానుభూతిపరుల పాత్రను ఎన్ఐఏ అనుమానిస్తోంది. దీనిపై ఉగ్ర ముఠా నోరు మెదపడం లేదని ఎన్ఐఏ వర్గాలంటున్నాయి. గతంలో చిక్కిన వారిని విచారిద్దాం దేశంలో పలు ప్రాంతాల నుంచి యువత భారీగా ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ నిఘా వర్గాలకు పట్టుబడ్డారు. గత జనవరి, ఫిబ్రవరిల్లో 16మంది సిరియా వెళ్లేందు కు సరిహద్దులు దాటుతూ పశ్చిమబెంగాల్, కశ్మీర్‌లలో పట్టుబడ్డారు. మార్చిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు సిరియా వెళ్లబోతూ మహారాష్ట్రలోని నాగపూర్ విమానాశ్రయంలో ఎన్ఐఏకు పట్టుబడ్డారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన వారు గతేడాది కూడా టర్కీ వెళ్లబోయి పట్టుబడ్డారు. పోలీసులు వీరందరికీ కౌన్సెలింగిచ్చి వదిలేశా రు. కొత్త వారికెరికైనా వీరు సహకరించారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో గతంలో పట్టుబడిన వారిని మరోసారి విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. కొం దరికి ఇప్పటికే నోటీసులిచ్చింది. -
టెక్నాలజీతోనే ఉగ్ర కుట్రకు ప్లాన్
- నిఘాకు చిక్కకుండా సాంకేతికత వినియోగం - లోతుగా ఆరా తీస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ‘ఉగ్ర మూకలు’ వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి జాతీయ దర్యా ప్తు బృందం(ఎన్ఐఏ) అధికారులు ఆశ్చర్యపోతున్నారు. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు ఐపీ అడ్రస్‌లను హ్యాక్ చేయడం, ‘అండర్‌గ్రౌండ’ వెబ్ ద్వారా బృందంగా ఏర్పడటాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. ఉగ్ర అనుమానితుల కస్టడీలో భాగంగా దాడి కుట్రకు దారి తీసిన విధానంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పేలుళ్ల కోసం వారు ఎక్కువగా సాంకేతికతను వాడటంపై విచారిస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా చాటింగ్, ఈ-మెయిల్స్ నేరుగా పంపితే నిఘా అధికారులు గుర్తించే అవకాశం ఉండటంతో ఉగ్రమూకలు వ్యూహా త్మకంగా వ్యవహరించాయి.వీడియో కాలింగ్, చాటింగ్ కోసం కొన్ని సందర్భాల్లో ఇతరుల ఐపీ అడ్రస్‌లను తస్కరించి ఉపయోగించాయి. హ్యాకింగ్ టూల్స్‌కు చిక్కకుండా ఉండేం దుకు ‘అండర్‌గ్రౌండ్’ వెబ్ ద్వారా బృందం గా ఏర్పడి దాడులకు కుట్రపన్నాయి. ఇందుకోసం టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను పీసీల్లో ఇన్స్టాల్ చేసుకున్నాయి. అలాగే సోషల్ మీడియా పనిచేయడానికి ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాల్సి ఉండగా నిఘా వర్గాలకు సర్వర్ అడ్రస్, ఇతర వివరాలు చిక్కకుండా ఉండేందుకు వారు డార్క్ నెట్‌ను ఉపయోగించారు. దీనివల్ల ‘అండర్‌గ్రౌండ్’ నెట్‌కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతోపాటు వాటిని నిర్వహిస్తున్న వారి వివరాలు తెలిసే అవకాశాలు చాలా కష్టమవుతుంది. కేంద్రం అధీనంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) ద్వారా ఉగ్ర వ్యూహానికి ఎన్ఐఏ చెక్ పెట్టింది. పరిజ్ఞానం అందించిందెవరు..? ఉగ్ర అనుమానితులకు భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరు అందించారనే దానిపై ఎన్ఐఏ దృష్టిసారించింది. పట్టుబడిన వారందరూ కూడా అంతగా నైపుణ్యం కలిగిన వారు కాకపోవడంతో వారికి సహకారం అందించిన వారెవరనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా వాట్సప్‌లోని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా పెద్ద ఎత్తున సమాచారం మార్పిడి జరిగినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తిగా కోడింగ్ విధానం ద్వారా గత కొంత కాలంగా సిరియాలోని ఐఎస్ కీలక నేత షఫీ ఆర్మర్ తరచూ చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ చాటింగ్ సమాచారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వాటిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో కలసి అధ్యయనం చేస్తున్నారు.