టెక్నాలజీతోనే ఉగ్ర కుట్రకు ప్లాన్ | Terrorists conspiracy to plan with technology | Sakshi
Sakshi News home page

టెక్నాలజీతోనే ఉగ్ర కుట్రకు ప్లాన్

Published Wed, Jul 6 2016 3:12 AM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM

టెక్నాలజీతోనే ఉగ్ర కుట్రకు ప్లాన్ - Sakshi

టెక్నాలజీతోనే ఉగ్ర కుట్రకు ప్లాన్

- నిఘాకు చిక్కకుండా సాంకేతికత వినియోగం
- లోతుగా ఆరా తీస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ‘ఉగ్ర మూకలు’ వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి జాతీయ దర్యా ప్తు బృందం(ఎన్‌ఐఏ) అధికారులు ఆశ్చర్యపోతున్నారు. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు ఐపీ అడ్రస్‌లను హ్యాక్ చేయడం, ‘అండర్‌గ్రౌండ’ వెబ్ ద్వారా బృందంగా ఏర్పడటాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. ఉగ్ర అనుమానితుల కస్టడీలో భాగంగా దాడి కుట్రకు దారి తీసిన విధానంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పేలుళ్ల కోసం వారు ఎక్కువగా సాంకేతికతను వాడటంపై విచారిస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్, ఈ-మెయిల్స్ నేరుగా పంపితే నిఘా అధికారులు గుర్తించే అవకాశం ఉండటంతో ఉగ్రమూకలు వ్యూహా త్మకంగా వ్యవహరించాయి.వీడియో కాలింగ్, చాటింగ్ కోసం కొన్ని సందర్భాల్లో ఇతరుల ఐపీ అడ్రస్‌లను తస్కరించి ఉపయోగించాయి.

హ్యాకింగ్ టూల్స్‌కు చిక్కకుండా ఉండేం దుకు ‘అండర్‌గ్రౌండ్’ వెబ్ ద్వారా బృందం గా ఏర్పడి దాడులకు కుట్రపన్నాయి. ఇందుకోసం టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను పీసీల్లో ఇన్‌స్టాల్ చేసుకున్నాయి. అలాగే సోషల్ మీడియా పనిచేయడానికి ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాల్సి ఉండగా నిఘా వర్గాలకు సర్వర్ అడ్రస్, ఇతర వివరాలు చిక్కకుండా ఉండేందుకు వారు డార్క్ నెట్‌ను ఉపయోగించారు. దీనివల్ల ‘అండర్‌గ్రౌండ్’ నెట్‌కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతోపాటు వాటిని నిర్వహిస్తున్న వారి వివరాలు తెలిసే అవకాశాలు చాలా కష్టమవుతుంది. కేంద్రం అధీనంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌వో) ద్వారా ఉగ్ర వ్యూహానికి ఎన్‌ఐఏ చెక్ పెట్టింది.

 పరిజ్ఞానం అందించిందెవరు..?
 ఉగ్ర అనుమానితులకు భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరు అందించారనే దానిపై ఎన్‌ఐఏ దృష్టిసారించింది. పట్టుబడిన వారందరూ కూడా అంతగా నైపుణ్యం కలిగిన వారు కాకపోవడంతో వారికి సహకారం అందించిన వారెవరనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా వాట్సప్‌లోని ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా పెద్ద ఎత్తున సమాచారం మార్పిడి జరిగినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తిగా కోడింగ్ విధానం ద్వారా గత కొంత కాలంగా సిరియాలోని ఐఎస్ కీలక నేత షఫీ ఆర్మర్ తరచూ చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ చాటింగ్ సమాచారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు వాటిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో కలసి అధ్యయనం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement