ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
జిల్లాలో 81 కేంద్రాల్లో గురువారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షను 65,256 మంది రాయాల్సి ఉండగా 560 మంది గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను బాధ్యతల నుంచి తప్పించారు.భానుగుడి (కాకినాడ), న్యూస్‌లైన్ : జిల్లాలో పదో తరగతి పరీక్షలు 81 కేంద్రాలలో గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
తొలిరోజు జరిగిన తెలుగుపేపర్-1 పరీక్షకు 65,256 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 560 మంది గైర్హాజరయ్యారు. అవకతవకలకు పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశామని, విధులను సక్రమంగా నిర్వహించని ఇద్దరు ఇన్విజిలేటర్లను బాధ్యతల నుంచి తప్పించామని డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ రాదని, ఇన్విజిలేటర్లు విధి నిర్వహణలో అలసత్వం వహించరాదని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠినచర్యలు తప్పవన్నారు.
‘ఫోన్‌కాల్‌తో బెంచీ’లకు స్పందన
పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో నేషనల్ మెంటల్ హెల్త్ మూవ్మెంట్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించిందని ఆ సంస్థ క న్వీనర్ చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. అడ్డతీగల నుంచి అభ్యర్థన రాగానే హుటాహుటిన 25 బెంచీలు పంపినట్టు తెలిపారు. ఎక్కడైనా అసౌకర్యం ఉంటే 98481 83838 నంబర్లో సంప్రదించాలని సూచించారు.