National SC Commission member
-
‘అప్పుడే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారు’
సాక్షి, విజయవాడ : అంటరానితనం పోయినప్పుడే ఎస్పీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని జాతీయ ఎస్సీ కమీషన్ మెంబర్ రాములు అన్నారు. గురువారం ఆయన కస్తూరిబాయిపేటలోని సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ఈ హాస్టల్లో త్రాగు నీటి సమస్య, దోమల బెడద ఉందని వెంటనే పరిష్కరించాలని కోరారు. కిచెన్ సరిగాలేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని మండిపడ్డారు. హాస్టల్లో వసతులు మంచిగా ఉంటేనే విద్యార్థులు చదవుల్లో రాణిస్తారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు విద్య ముఖ్యమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలని సూచించారు. కార్పొరేట్ విద్యార్థులతో ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు పోటీపడి చదవాలన్నారు. ఒక్కో విద్యార్థి కి ప్రభుత్వం తరపున సంవత్సరానికి రూ. 2లక్ష ల50 వేలు ఖర్చు చేస్తుందని, దానికి తగ్గట్టుగా ఫలితాలు ఉండాలని సూచించారు. కులాల పేరుతో దూషించడం సబబు కాదన్నారు. గుంటూరులో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలకే రక్షణ కరవైతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు గుంటూరులో పర్యటించి శ్రీదేశి విషమై వివరణ కోరుతామని తెలిపారు. -
కష్టపడితే పార్టీలో గుర్తింపు: బీజేపీ నేతలు
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములుకు సన్మానం సాక్షి, హైదరాబాద్: అంకితభావంతో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు బీజేపీలోనే గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యునిగా నియమితులైన కె.రాములును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నాయకుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళీధరావు మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదించిన రాజ్యాంగబద్ధమైన ఎస్సీ కమిషన్‌కు రాష్ట్రం నుంచి రాములు నియామకం కావడం సామాన్య కార్యకర్తకు దక్కిన అందలం అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ పైరవీలు, సిఫారసులు లేకుండా కష్టపడేవారికి, అంకితభావం ఉన్నవారికి పదవులు కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు. ‘బీజేపీలో పనిచేస్తున్నప్పుడు దళితులకు అంటరాని పార్టీ అంటూ హేళన చేసేవారు. ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని ఇచ్చి, ఆర్థిక వనరులను కూడా సమకూర్చారు. ప్రస్తుతం జాతీయస్థాయిలో పదవి ఇచ్చారు’అని కె.రాములు అన్నారు.