breaking news
National Sports Governance Bill
-
బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికే పెద్దపీట వేస్తోందని, తద్వారా భారత్‌ను ప్రపంచ టాప్–10 క్రీడా దేశాల్లో నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ప్లేకామ్ బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘గతంలో క్రీడా సమాఖ్యల్లో తిష్ట వేసుకు కూర్చున్న సమస్యలు, వివాదాలే పతాక శీర్షికలయ్యేవి. ప్రస్తుతం మేం ఈ వివాదాలను పక్కనబెట్టి అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపర్చడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. అంతర్జాతీయ క్రీడల్లో భారత ఆటగాళ్లు పోడియంలో నిలిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా తీసుకొచ్చిన క్రీడా బిల్లు కూడా తగవుల్ని పరిష్కరించడంతో పాటు క్రీడాకారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. అథ్లెట్లు రాణించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు. బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!దేశంలోని క్రీడా సమాఖ్యలన్నీ క్రీడా బిల్లుకు లోబడే ఉండాలని నిర్ణయించామని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా కొత్త క్రీడా పాలసీ ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. తద్వారా ప్రతీ సమాఖ్యలోనూ జవాబుదారీతనాన్ని పెంచామని అన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో పురుషులకు దీటుగా భారత మహిళా అథ్లెట్లు పోటీపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కార్యక్రమాలు అథ్లెట్ల కోసమే రూపొందించామని మాండవీయ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని, భారత క్రీడావికాసం కోసం ప్రణాళికబద్ధంగా కృష్టి చేస్తున్నారని ఆయన చెప్పారు. పదేళ్ల ప్రణాళికతో క్రీడాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మన్సుఖ్ మాండవీయ అన్నారు. క్షేత్రస్థాయిలోఇక భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతిభాన్వేషణ పోటీలను పెంచుతామని చెప్పారు. కేవలం నగరాలు, అకాడమీలే కాదు... మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రతిభావంతులను పాఠశాల స్థాయి పోటీల్లో గుర్తించి నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. -
BCCI: అప్పటి వరకు అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ తన పూర్తి పదవీకాలం కొనసాగనున్నారు. 2022 అక్టోబర్‌లో ఎంపికైన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారు. గత నెల 19న బిన్నీకి 70 ఏళ్లు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం ఆయన వెంటనే తప్పుకోవాల్సి ఉంది. అయితే తాజాగా మంగళవారం ‘నేషనల్ స్పోర్ట్స్ బిల్’ పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీని ప్రకారం క్రీడా సంఘాల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచారు.ఇక బీసీసీఐ కూడా ఒక క్రీడా సమాఖ్యగా ఈ బిల్లు పరిధిలోకి రావడంతో ఈ నిబంధన కూడా దానికి వర్తించనుంది. దీంతో బిన్నీ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు చివర్లో జరిగే ఏజీఎంలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బీసీసీఐ ముందుకు వెళుతుంది. ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకోకపోయినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్లో మన జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా కొత్త బిల్లు పరిధిలోకి వచ్చింది.అయితే బోర్డు నుంచి ఎలాంటి సమాచారం కోరకుండా దానిని ఆర్టీఐ పరిధి నుంచి తప్పిస్తూ సవరణ చేర్చిన తర్వాతే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. పార్లమెంట్లో ఇప్పుడే బిల్లు పాస్ అయింది కాబట్టి దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత లోటుపాట్లపై చర్చిస్తామని బీసీసీఐ న్యాయ నిపుణుల బృందం అభిప్రాయపడింది. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ -
National Sports Bill 2025: లోక్‌సభ ఆమోదం.. ఇందులో ఏముంది?
జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు-2025 (National Sports Governance Bill)కి లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. అదే విధంగా.. జాతీయ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లుకు కూడా ఈరోజే ఆమోదం లభించింది. అయితే, విపక్షాలు మాత్రం ఇందుకు సహకరించలేదు. అయినప్పటికీ నిరసనల నడుమే క్రీడా పరిపాలనా బిల్లుకు ఆమోదం లభించింది.అతిపెద్ద సంస్కరణ ఇదిఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడా రంగంలో ప్రవేశపెట్టిన అతిపెద్ద సంస్కరణ ఇది. జవాబుదారీతనం తీసుకురావడం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుంది. క్రీడా సమాఖ్యలన్నీ అత్యుత్తమంగా పరిపాలన చేసేందుకు ఇది తోడ్పడుతుంది’’ అని పేర్కొన్నారు.స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌లో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుందన్న మాండవీయ.. దురదృష్టవశాత్తూ ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదంలో పాలు పంచుకోలేకపోయాయన్నారు. ‘‘1975లో మేము ఈ బిల్లుకు సంబంధించి తొలి డ్రాఫ్ట్ తయారుచేశాము. కానీ క్రీడలు కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజకీయ రంగు పులుముకున్న కారణంగా ఇది సాధ్యం కాలేదు.అయితే, కొంతమంది మంత్రులు ఈ బిల్లును ప్రవేశపెట్టగలిగారు కానీ.. దీనికి ఆమోదం లభించేలా చేయలేకపోయారు. 2011లో మనకు జాతీయ స్పోర్ట్స్ కోడ్ వచ్చింది. దానిని బిల్లుగా మార్చేందుకు మేము కృషి చేశాం.అనంతరం క్యాబినెట్లో చర్చల్లో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఇది పార్లమెంట్ వరకు చేరుకోలేకపోయింది. ఏదేమైనా నేనషల్ స్పోర్ట్స్ బిల్ గవర్నెన్స్ బిల్ ఒక సంచలనాత్మక మార్పునకు నాంది.అతి పెద్దదైన మన దేశంలో ఒలింపిక్స్‌లో, అంతర్జాతీయ స్థాయిలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం నిజంగా విచారకరం. క్రీడా రంగ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది’’ అని మన్సుఖ్ మాండవీయ చెప్పుకొచ్చారు.ఇందులో ఏముంది?కాగా క్రీడా సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పించడం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ద్వారా సాధ్యమవుతుంది. రాజకీయ ఒత్తిడి, జోక్యం ఉండదని చెబుతున్నారు. స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు ద్వారా.. అథ్లెట్లు, ఆఫీస్ బేరర్లు, క్రీడా సమాఖ్యల మధ్య తగాదాలను త్వరితగతిన పరిష్కరించే వీలుంటుంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఆటగాళ్ల ఎంపిక ఉండేలా చూసుకుంటారు.జాతీయ క్రీడా సమాఖ్యలకు సంబంధించిన ఆడిట్లు సకాలంలో పూర్తి చేయడంతో పాటు.. నిధుల వినియోగానికి సంబంధించి పారదర్శకత ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. క్రీడా పరిపాలనా విభాగాన్ని మెరుగుపరచి, ఎవరి పాత్ర ఏమిటన్న అంశాలపై స్పష్టతనివ్వడం ద్వారా ఒలింపిక్స్ వంటి హై ప్రొఫైల్ ఈవెంట్లు నిర్వహించడం కాస్త సులువుగా మారుతుంది. అయితే, అన్నింటికీ మించి ఆటగాళ్లకు సురక్షిత వాతావరణం కల్పించడం.. అంటే.. అన్ని రకాల వేధింపుల నుంచి ఉపశమనం కలిగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.బీసీసీఐకి రిలీఫ్ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి మాత్రం ఈ బిల్లులో ఉపశమనం లభించింది. బోర్డు వ్యవహారాల గురించి ఆర్టీఐ నుంచి సమాచారం కోరేందుకు మాత్రం అనుమతి ఉండదు. బీసీసీఐ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదు.. కాబట్టి అందుకే ఈ మేరకు మినహాయింపు ఇచ్చారని సమాచారం. అదే విధంగా.. అడ్మినిస్ట్రేటర్లకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ బాడీ అనుమతించినట్లయితే.. 70- 75 ఏళ్ల వ్యక్తులు కూడా క్రీడా సమాఖ్యల ఎన్నికల్లో పాల్గొనవచ్చు.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు!