కలెక్టరేట్పై జాతీయ జెండా ఏదీ?
అది పరిపాలనకు కేంద్రమైన కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం. అక్కడ అంతా జిల్లా అధికారులే ఉంటారు. అయినా ఆ కార్యాలయంపై మువ్వన్నెల జాతీయ పతకాన్ని ఎగుర వేయడాన్ని విస్మరించారు. రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రభుత్వ కార్యాలయాలపై జెండాను విధిగా ఉంచాలి. మే 23 నుంచి కొత్త భవనంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టర్, జేసీ, జేసీ–2, డీఆర్వో ఇంత మంది అధికారులు రోజూ కార్యాలయానికి వస్తూ పోతూ ఉన్నారే గానీ, జాతీయ జెండా గురించి ఎవరికీ స్పురణకు రాకపోవడం విచారకరం. కడప కల్టెరేట్