nationalise
-
అదానీ ఆస్తులను జాతీయం చేయండి: మోదీకి బీజేపీ సీనియర్ నేత సంచలన సలహా
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్ట్‌తో అదానీ గ్రూపు చైర్మన్ గౌతం విలవిల్లాడుతుండగా బీజేపీ సీనియర్ సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ వివాదంపై సోషల్‌మీడియా ద్వారా స్పందించిన ఆయన ప్రధాని మోదీకి ఒక సలహా కూడా ఇచ్చారు. (షాకింగ్ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో) అదానీగ్రూపు - హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సుబ్రమణియన్ స్వామి గురువారం ట్విటర్లో స్పందించారు. అదానీ & కో మొత్తం వాణిజ్య ఆస్తులను జాతీయం చేయాలని, ఆపై ఆ ఆస్తులను విక్రయించాలంటూ ప్రధాని మోదీకి సలహా ఇచ్చారు. అంతేకాదు అదానీని హోప్‌లెస్‌గా భావించిన మోదీ ప్రభుత్వం నెమ్మదిగా అదానీని డిస్ ఓన్ చేసుకుంటోందనీ, ఎలా వచ్చిన వాళ్లు అలానే పోతారు అంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. I believe Modi Govt is slowly disowning Adani as a hopeless case. Easy come easy goes — Subramanian Swamy (@Swamy39) February 2, 2023 My advice to Modi: Nationalise the entire commercial properties of Adani & Co for “ negative” payment and later auction the properties. — Subramanian Swamy (@Swamy39) February 2, 2023 -
స్వతంత్ర భారతి 1969/2022
బ్యాంకుల జాతీయకరణ ప్రైవేటు వ్యాపారవేత్తల యాజమాన్యంలోని రూ.50 కోట్ల డిపాజిట్లను కలిగి ఉన్న 14 బ్యాంకులను 1969 జూలై 19న ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల జాతీయకరణ అనే పేరుతో ఈ చర్య పేర్గాంచింది. ప్రైవేటు రంగం తన సొంత వినియోగానికి భద్రంగా నిల్వ చేసి పెట్టుకున్న వనరులను ప్రజల కోసం విముక్తం చేయడమే ఈ జాతీయకరణ ఆశయం అని ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది. ఆ తర్వాత 1980 ఏప్రిల్‌లో మరో 6 బ్యాంకులను జాతీయం చేశారు. కొన్ని విధాలుగా ఈ చర్య సత్ఫలితాలనే ఇచ్చింది. 1969లో 8,261 మేరకు ఉన్న బ్యాంకు శాఖల సంఖ్య 2000 నాటికి 65,521 కి చేరుకుంది. అంతకుముందు 65 వేల మందికి ఒక శాఖ చొప్పున ఉంటే ఆ తర్వాత 15 మందికి ఒక శాఖ చొప్పున ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ ఇరవై ఏళ్లలో బ్యాంకింగ్ రంగం పురోగమించి ఒక్కో ఏటీఎం సెంటర్ ఒక్కో బ్యాంకు శాఖలా సకల సేవల్ని అందిస్తోంది. జాతీయకరణ తర్వాత రైతులకు మరిన్ని నిధులు దక్కాయి. కానీ అందుకు బ్యాంకులు మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. వ్యాపార ప్రయోజనాలను బట్టి కాక, రాజకీయ ప్రయోజనాలను బట్టి రుణాలు మంజూరవడం మొదలైంది. రానిబాకీలు పేరుకుని పోవడంతో బ్యాంకుల్ని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వమే 20 వేల కోట్ల రూపాయల వరకు సర్దవలసి వచ్చింది. మరోవైపు జాతీయకరణ వల్ల ప్రయోజనం తీరిపోయిందనే అభిప్రాయం కొంతకాలంగా గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణం ప్రైవేటు బ్యాంకులు వేగంగా వృద్ధి చెందుతూ ఉండటమే. -
కరోనాపై జాతీయ విధానం కావాలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి జాతీయ విధానం తీసుకురావాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజకీయ ఏకాభిప్రాయంతోనే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక వీడియో సందేశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా కోవిడ్–19 మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని, బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు. దేశ పౌరులందరికీ కరోనా టీకాలు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని తక్షణమే పెంచాలని చెప్పారు. ఇది మనకు పరీక్షా సమయమని, దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలని, ఒకరికొకరు సహకరించుకోవాల ని పిలుపునిచ్చారు. టీకా ధరల్లో వివక్షను అంతం చేయండి పేద ప్రజలు, వలస కూలీలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని, ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు తిరిగి వెళ్లున్నారని, వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నెలకు రూ.6,000 చొప్పున బదిలీ చేయాలని సోనియా గాంధీ సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలన్నారు. బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులకు ఆక్సిజన్, ఔషధాలు, ఇతర పరికరాలు యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలని కోరారు. కరోనా టీకా ధరల్లో వివక్షను అంతం చేయాలని పేర్కొన్నారు. మహమ్మారిపై పోరాటం విషయంలో తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని సోనియా గాంధీ ఉద్ఘాటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మన దేశం త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు సోనియా కృతజ్ఞతలు తెలిపారు. -
సింగరేణి విద్యుత్‌ను జాతికి అంకితం చేయాలి
గోదావరిఖని : జైపూర్ సింగరేణి థర్మల్ పవర్‌స్టేషన్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) చేసి జాతికి అంకితం చేయాలని బ్యాక్వర్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఆఫ్ సింగరేణి ఎంప్లాయీస్ (బేస్) ప్రధాన కార్యదర్శి మేరుగు రాజయ్య కోరారు. 2016 మార్చి 13న ఎస్టీపీపీలోని 600 మెగావాట్ల టర్బైన్ జనరేటర్‌ను సింక్రనైజేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారని, అప్పటి నుంచి రోజువారీగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గజ్వేల్ గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నారని తెలిపారు. గత మూడు నెలలుగా ఎస్టీపీపీ విద్యుత్‌ను మార్కెట్ ధరకు కాకుండా కేవలం ఇంధనంగా వాడుతున్న బొగ్గు ధరను చెల్లిస్తున్నట్లుగా తెలుస్తుందని, దీంతో సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు నష్టపోతుందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం చొరవ చూపి వెంటనే జైపూర్ ఎస్టీపీపీని సీఓడీ చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిచే జాతికి అంకితం చేసి సింగరేణి కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.