సింగరేణి విద్యుత్‌ను జాతికి అంకితం చేయాలి
Published Mon, Jul 18 2016 6:51 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
గోదావరిఖని : జైపూర్ సింగరేణి థర్మల్ పవర్‌స్టేషన్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) చేసి జాతికి అంకితం చేయాలని బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఆఫ్ సింగరేణి ఎంప్లాయీస్ (బేస్) ప్రధాన కార్యదర్శి మేరుగు రాజయ్య కోరారు. 2016 మార్చి 13న ఎస్‌టీపీపీలోని 600 మెగావాట్ల టర్బైన్ జనరేటర్‌ను సింక్రనైజేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారని, అప్పటి నుంచి రోజువారీగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గజ్వేల్ గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నారని తెలిపారు.
గత మూడు నెలలుగా ఎస్‌టీపీపీ విద్యుత్‌ను మార్కెట్ ధరకు కాకుండా కేవలం ఇంధనంగా వాడుతున్న బొగ్గు ధరను చెల్లిస్తున్నట్లుగా తెలుస్తుందని, దీంతో సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు నష్టపోతుందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం చొరవ చూపి వెంటనే జైపూర్ ఎస్‌టీపీపీని సీఓడీ చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిచే జాతికి అంకితం చేసి సింగరేణి కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
Advertisement