ఈ బ్యాంకుకు వెళితే గొడుగు మస్ట్!
అది ఇంగ్లాండ్‌లోని ఇప్సివిచ్ నగరం. అక్కడి యూరోపార్క్ ప్రాంతంలో ఉన్న నాట్‌వెస్ట్ బ్యాంకుకు వెళితే... గొడుగు తప్పనసరి. బ్యాంకుకు వెళితే... నగదు, నగా తెచ్చుకుంటే సెక్యూరిటీ చూసుకోవాలి గాని ఈ గొడుగు గోల ఏమిటంటారా? అసలు విషయం ఏమిటంటే... ఈ బ్యాంకు భవనం పైకప్పు సీగుల్ పక్షలు గూళ్లు పెట్టుకున్నాయి. ఈ గూళ్ల నుంచి పిల్లలు జారి కిందపడుతూ ఉంటాయట. వాటి దగ్గరికి ఎవరినీ రానీయకుండా పైనుంచి తల్లి పక్షి కాపాలా కాస్తుంది.
బ్యాంకు దిశగా ఎవరు వచ్చినా మిస్సైల్లా దూసుకొచ్చి నెత్తిన ముక్కుతో పొడుస్తాయట. దాంతో బ్యాంకు కస్టమర్ల క్షేమం కోసం మేనేజరు ఏకంగా ఒక గొడుగును ఏర్పాటు చేసి ఇలా సెండాఫ్ ఇస్తోంది. అన్నట్లు ‘సీగుల్లతో జాగ్రత్త’ అంటూ బ్యాంకు ముందు నోటీసు కూడా పెట్టింది.