Naukri jobspeak index
-
వైట్ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ డౌన్
ముంబై: ఐటీ–సాఫ్ట్వేర్, టెలికం, విద్యా రంగాల్లో నియామకాలు మందగించిన నేపథ్యంలో అక్టోబర్–నవంబర్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు హైరింగ్ తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. నౌకరీ జాబ్‌స్పీక్ సూచీకి సంబంధించిన నివేదిక ప్రకారం 2022 అక్టోబర్–నవంబర్‌లో 2,781 జాబ్ పోస్టింగ్స్ నమోదు కాగా ఈసారి అదే వ్యవధిలో 2,433 పోస్టింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. నౌకరీడాట్‌కామ్‌లో సంస్థలు పోస్ట్ చేసే ఉద్యోగావకాశాలను బట్టి దేశీయంగా ప్రతి నెలా నియామకాల ధోరణిని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సూచిస్తుంది. మేనేజర్లు, క్లర్కులు, అడ్మిని్రస్టేషన్ సిబ్బంది మొదలైన ఆఫీసు ఆధారిత కొలువులను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► టెలికంలో 18 శాతం, విద్యా రంగంలో 17 శాతం, రిటైలింగ్ రంగంలో 11 శాతం మేర వైట్ కాలర్ నియామకాలు తగ్గాయి. ఆతిథ్య, ట్రావెల్, ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో హైరింగ్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ►ఇంధన కంపెనీలు వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా కొత్త రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటం వంటి సానుకూల పరిణామాలతో ఆయిల్, గ్యాస్ రంగాల్లో హైరింగ్ 9 శాతం పెరిగింది. ►కొత్త ఉద్యోగావకాశాలు ఫార్మా రంగంలో 6 శాతం, బీమా రంగంలో 5 శాతం పెరిగాయి. ►ఐటీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 22 శాతం క్షీణించింది. అయితే అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 1 శాతం మేర పెరిగాయి. ►ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సంబంధ మెషిన్ లెరి్నంగ్ ఇంజినీర్లకు అవకాశాలు 64 శాతం మేర, ఫుల్ స్టాక్ డేటా సైంటిస్టులకు కొత్త ఉద్యోగాలు 16 శాతం మేర పెరిగాయి. ►మెట్రోలతో పోలిస్తే నాన్–మెట్రోల్లోనే ఎక్కువగా హైరింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. వదోదరలో అత్యధికంగా 9 శాతం కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్ నమోదయ్యాయి. ►ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రోల్లో నియామకాలు చెరి 12 శాతం మేర, ఐటీ ప్రధానమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెలో వరుసగా 20 శాతం, 18 శాతం, 21 శాతం, 18 శాతం మేర హైరింగ్ క్షీణించింది. ►2023 ఆసాంతంలో కనిపించిన ట్రెండ్‌కి అనుగుణంగా అక్టోబర్–నవంబర్‌లో కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ వైపే కంపెనీలు మొగ్గు చూపాయి. 16 ఏళ్ల పైబడి అనుభవమున్న సీనియర్ నిపుణుల నియామకాలు 26 శాతం పెరిగాయి. ఫ్రెషర్లకు కొత్త ఆఫర్లు 13 శాతం పడిపోయాయి. -
కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక
White collar tech jobs take backseat: వైట్ కాలర్ జాబ్అంటే ముందుగా గుర్తొచ్చేది టెక్ ఉద్యోగమే. అయితే టెక్ ఉద్యోగాలకు సంబంధించిన సంచలన నివేదిక ఒకటి ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. జాబ్ మార్కెట్లో ఐటీ రంగానికి ఎదురు గాలి తప్పడం లేదు. ప్రస్తుత టెక్ రంగాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా వెట్ కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి భారతీయ జాబ్ మార్కెట్లు 2,835 స్కోర్‌ను నమోదు చేశాయి, ఇది గత నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2023కి సంబంధించిన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశంలో ఉపాధి ధోరణి నెలవారీగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ వార్షిక ప్రాతిపదికన ఇంకా బలహీన ధోరణే కనిపిస్తొంది. గత ఏడాదితో పోలిస్తే 8.6 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే అనేక రంగాలు వృద్ధిని కనబరిచడం ఊరటనిస్తోంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ , అండ్ ట్రావెల్ రంగం 22 శాతం వృద్ధిని సాధించి స్టార్ పెర్ఫార్మర్గా అవతరించింది. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగం వెలవెలబోయింది. కష్టాల్లో ఐటీరంగం ప్రపంచ ప్రకంపనల మధ్య ఐటీ రంగం కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, అయినప్పటికీ, బిగ్ డేటా టెస్టింగ్ ఇంజనీర్, IT, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ IT ఆపరేషన్స్ మేనేజర్ లాంటి ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ఐటీ-కేంద్రీకృత నగరాల్లో సెప్టెంబర్ 2023లో కొత్త జాబ్ ఆఫర్లు భారీగా తగ్గాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేపనిలో వేలాది మందిని తొలగించాయి. మెటా, అమెజాన్ సంస్థల తాజాగా మరో రౌండ్ కోతల వార్తలు ప్రపంచవ్యాప్తంగా టెకీలను ఆందోళనలో పడేస్తున్నాయి. హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో 22 శాతం వృద్ధితో టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. ఈ సీజన్లో చేసుకునే కుటుంబాలు ,ఒంటరి ప్రయాణీకు టూర్లు ఈ వృద్ధికి దోహదపడినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ మేనేజర్ , గెస్ట్ సర్వీసెస్ రోల్స్ వంటి ఉద్యోగాలు డిమాండ్ నేపథ్యంలో ముంబై ఈ రంగంలో ఉద్యోగ ఆఫర్లలో ముందుంది. BFSI ,ఆరోగ్య సంరక్షణ రంగాలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI) సెక్టార్ , హెల్త్‌కేర్ సెక్టార్ కూడా కొంత పురోగతి సాధించాయి. ప్రతి ఒక్కటి సెప్టెంబర్ 2023లో సంవత్సరానికి 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BFSI రంగంలో, అహ్మదాబాద్, చండీగఢ్ , జైపూర్ వంటి నగరాలు బ్రాంచ్ మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వంటి పాత్రలకు డిమాండ్ పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, BFSIలోని బ్యాంకింగ్ సబ్ సెగ్మెంట్ ఇదే కాలంలో 40 శాతం వృద్ధిని సాధించింది. హెల్త్‌కేర్ సెక్టార్లో, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్/ఇన్ఫర్మేటిక్స్ మేనేజర్ వంటి స్థానాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ సెక్టార్లో హైరింగ్ ఊపందుకోవడంలో అహ్మదాబాద్, కోల్‌కతా ముందున్నాయి. ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు కూడా సానుకూల ఉపాధి ధోరణులకు దోహదపడ్డాయి, గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో రెండూ 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BPO/ITES , FMCG రంగాలలో సవాళ్లు: మరోవైపు BPO/ITES, FMCG రంగాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో వరుసగా 25 శాతం మరియు 23 శాతం ప్రతికూల వృద్ధిని సాధించింది. నాన్-మెట్రోలు షైన్ ఉద్యోగాల కల్పలనో మెట్రోలతు పోలిస్తే నాన్‌మెట్రో నగరాలుల మెరుగ్గా ఉండటం విశేషం. 2023, సెప్టెంబరులో ఉద్యోగాల కల్పనలో నాన్-మెట్రో నగరాలు మెట్రోలను అధిగమించాయి. వడోదర, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలు అదే నెలతో పోలిస్తే నియామకంలో వరుసగా 4 శాతం, 3, 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం. వడోదర BPO/ITES,యు కన్స్ట్రక్షన్/ఇంజనీరింగ్ సెక్టార్ హైరింగ్‌లో రాణించింది. మరోవైపు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సోమవారం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక 2022-2023 ప్రకారం, 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న నిరుద్యోగిత రేటు దేశంలో జులై 2022-జూన్ 2023 మధ్యకాలంలో ఆరేళ్ల కనిష్టం వద్ద 3.2 శాతంగా నమోదైంది. -
నియామకాల జోరు: ఐటీ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాల జోరు మొదలైంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో రిక్రూట్మెంట్ 15 శాతం పెరిగిందని నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక వెల్లడించింది. నౌకరీ.కామ్‌లో మే నెలలో జాబ్ పోస్టింగ్స్ 2,049 నమోదైతే, జూన్‌లో ఇది 2,350 ఉందని తెలిపింది. ‘ఐటీ-సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ రంగాల కారణంగా ఈ స్థాయి వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌లో 15 శాతం తిరోగమనం చెందిన నేపథ్యంలో మార్కెట్ నిలదొక్కుకోవడంతోపాటు రికవరీకి ఇది నిదర్శనం. సవాళ్ల నుంచి బయటపడేందుకు కంపెనీలకు ఐటీ వినియోగానికి డిమాండ్ పెరిగింది. ఐటీ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సర్వీసుల రంగం జూన్‌లో 5 శాతం దూసుకెళ్లింది. కోవిడ్-19 ముందస్తు కాలం 2019 జూన్‌తో పోలిస్తే ఈ రంగం అత్యధికంగా గత నెలలో 52 శాతం వృద్ధి సాధించింది. రిటైల్, యాత్రలు, ఆతిథ్య రంగం సైతం మెరుగ్గా పనితీరు కనబరుస్తోంది. హోటల్స్, రెస్టారెంట్స్, ఎయిర్‌లైన్స్, ట్రావెల్ విభాగాలు 87 శాతం, రిటైల్‌లో 57, బీమా 38, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు 29, ఫార్మా, బయోటెక్ 22, ఎఫ్ఎంసీజీ 22, విద్యా బోధన 15, బీపీవో, ఐటీఈఎస్‌లో 14 శాతం నియామకాలు అధికమయ్యాయి. రిక్రూట్మెంట్ హైదరాబాద్, పుణే 10 శాతం, బెంగళూరు 4 శాతం పెరిగింది. మె నెలలో తిరోగమన బాట పట్టిన ఢిల్లీ/ఎన్సీఆర్ 26 శాతం, కోల్‌కత 24 శాతం వృద్ధి నమోదు చేశాయి’ అని నివేదిక వివరించింది. -
జులైలో పుంజుకున్న నియామకాలు
ముంబై : లాక్డౌన్ సడలింపులు, కీలక పరిశ్రమలు తెరుచుకోవడంతో భారత్‌లో నియామకాల ప్రక్రియ ఊపందుకుందని నౌకరీ జాబ్స్సీక్ పేర్కొంది. జులైలో దేశవ్యాప్తంగా హైరింగ్ ప్రక్రియ అంతకుముందు నెలతో పోలిస్తే 5 శాతం పెరిగిందని వెల్లడైంది. జులైలో నియామకాలు అధికంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో 36 శాతం, హెచ్ఆర్లో 37 శాతం, నిర్మాణ ఇంజనీరింగ్ రంగాల్లో 27 శాతంగా ఉన్నాయని తెలిపింది. బీఎఫ్ఎస్ఐ పరిశ్రమలో 16 శాతం, ఆటోమొబైల్స్‌లో 14 శాతం, టెలికాం పరిశ్రమలో 13 శాతం మేర హైరింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదైంది. ఐటీ హార్డ్‌వేర్ రంగంలో 9 శాతం మేర హైరింగ్ ప్రక్రియ జరగ్గా, ఐటీ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి హైరింగ్ జోరూ కనిపించలేదని నౌకరీ జాబ్‌స్పీక్ పేర్కొంది. అయితే విద్యా బోధనా రంగంలో -22 శాతం, ఆతిథ్య రంగంలో -5 శాతం, రిటైల్‌లో -2 శాతం మేర హైరింగ్ ప్రక్రియలో క్షీణత నమోదైంది. ఇక మెట్రో నగరాల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యధికంగా హైరింగ్ ప్రక్రియ 10 శాతం వృద్ధి చెందగా తర్వాతి స్ధానాల్లో వరుసగా ముంబై (8శాతం), చెన్నై(4 శాతం) నిలిచాయి. బెంగళూర్, కోల్‌కతాలో నియామకాలు 4 శాతం తగ్గడం గమనార్హం. ఇక మెట్రోలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి నగరాలు జైపూర్, వదోదర, చండీగఢ్‌లో భారీగా నియామకాలు వృద్ధి చెందాయి. జైపూర్‌లో హైరింగ్ ప్రక్రియ 40 శాతం పెరగ్గా, వదోదరాలో నియామకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. జులైలో అంతకుముందు నెలలతో పోలిస్తే నియామకాల ప్రక్రియ ఊపందుకుందని రిక్రూట్మెంట్, మీడియా, వినోద రంగం, నిర్మాణ రంగాల్లో సాధారణ పరిస్ధితి తిరిగి నెలకొంటోందని నౌక్రీ.కాం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ పేర్కొన్నారు. తయారీ, నిర్వహణ, ఫార్మా, మీడియా, మార్కెటింగ్, ప్రకటనలు, సేల్స్ రంగాల్లో నియామకాలు ఊపందుకోగా, ఆతిథ్య, బోధన రంగాల్లో నియామకాలు ఇంకా పుంజుకోలేదని వివరించారు. చదవండి : ఊరట : జనవరి నుంచి కొలువుల సందడి -
హైదరాబాద్‌లో పెరిగిన హైరింగ్
నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడి హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీ దాదాపు 20 శాతం పెరిగింది. 2013 డిసెంబరు నుంచి 2014 డిసెంబరు మధ్య దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ తీరును విశ్లేషించినపుడు ఈ విషయం వెల్లడైనట్లు జాబ్స్ వెబ్సైట్ నౌకరీ డాట్‌కామ్‌కు చెందిన నౌఖరీ జాబ్ స్పీక్ తెలియజేసింది. మొత్తమ్మీద అన్ని నగరాలనూ పోలిస్తే పుణె 30 శాతం, చెన్నై 29 శాతంతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌ది ఆ తరువాతి స్థానం కాగా... బెంగళూరు 17%, ముంబయి 11%, కోల్‌కత 10%తో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం 1 శాతం భర్తీ పెరుగుదలతో ఆఖర స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రంగాల వారీ చూస్తే టెలికంలో 12% తగ్గుదల కనిపించగా చమురు-గ్యాస్ 27%, బ్యాంకింగ్ 17%, ఐటీ 12% వృద్ధితో తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఏ కంపెనీలో చూసినా ఫైనాన్స్ విభాగంలో 21%, హెచ్ఆర్ విభాగంలో 20%, ఐటీ విభాగంలో 18% భర్తీలో పెరుగుదల నమోదైనట్లు జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడిచింది. మొత్తమ్మీద ఉద్యోగాల భర్తీలో 10% వృద్ధి నమోదైనట్లు ఈ ఇండెక్స్ వెల్లడించింది. ఐటీ సెక్టార్లో అధిక వేతనాలు న్యూఢిల్లీ: దేశంలోనే లాభదాయకమైన రంగంగా ఐటీ సెక్టార్ ఆవిర్భవించింది. ఈ రంగంలో ఉద్యోగులు కనీసం గంటకు రూ.291 లను జీతంగా పొందుతున్నారు. ఇది సగటున గంటకు రూ.341గా ఉంది. ఇది ఇతర రంగాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాగే పురుషులతో పోలిస్తే మహిళలు 34 శాతంమేర తక్కువ జీతాల్ని పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆన్లైన్ కెరీర్, నియామకాల సొల్యూషన్స్ ప్రొవైడర్ మాన్స్టర్ ఇండియా పేర్కొంది. దీని ప్రకారం నిర్మాణ రంగంలో ఉద్యోగుల సగటు జీతాలు గంటకు రూ.259, హెల్త్ కేర్ రంగంలో రూ.215, తయారీ-రవాణా రంగాల్లో రూ.230గా ఉన్నాయి. విద్యా రంగంలోని ఉద్యోగులు చాలా తక్కువ జీతాల్ని (గంటకు రూ.186లు) పొందుతున్నారని తెలిపింది.