గేట్–2017 ఫలితాలు విడుదల
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ర్యాంకుల పంట..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, కేంద్ర విద్యా సంస్థల్లో ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గేట్–2017 పరీక్ష ఫలితాలను ఆదివారం ఐఐటీ రుర్కీ విడుదల చేసింది. విద్యార్థులు www. gate.iitr.ernet.in వెబ్సైట్ నుంచి ఫలితాలు పొందాలని సూచించింది. ఆలిండియా స్థాయి గేట్–2017 పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ర్యాంకుల పంట పండింది.
ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్లో నవీన్ తాడూరి మొదటి ర్యాంక్ సాధించాడు. ఈసీఈ విభాగంలో కె.సాయిప్రమోద్రెడ్డికి మొదటి ర్యాంకు, శ్రీకల్యాణికి రెండో ర్యాంకు, ఉప్పు లిఖిత సాయికి ఆరో ర్యాంకు, ఆనంద్ ఉప్పాడకు తొమ్మిదో ర్యాంకు దక్కింది. అలాగే సీఎస్ఐటీలో మేఘశ్యామ్ పసునూరి ఆరో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. వీరితోపాటు జేఎన్టీయూహెచ్లో 2016లో బీటెక్–ఈఈఈ పూర్తి చేసుకున్న అచ్చుకట్ల సర్ఫరాజ్ నవాజ్ జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు.