8న నవోదయ ప్రవేశ పరీక్ష
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 46 కేంద్రాలు
12,689 మంది విద్యార్థులు
ఉదయం 11.30 నుంచి 1.30 వరకు పరీక్ష
కాగజ్‌నగర్ రూరల్ : కాగజ్‌నగర్‌లోని త్రిశూల్ పహాడ్‌పై గల కేంద్రీయ జవహర్‌కాగజ్‌నగర్‌లోని త్రిశూల్ పహాడ్‌పై గల కేంద్రీయ జవహర్ నవోదయ జిల్లా విద్యాలయంలో 2017–18జిల్లా విద్యాలయంలో 2017–18 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 8న ఉదయం 11.30 నుంచి 1.30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ విద్యాలయ ప్రిన్సిపాల్ – మిగతా 2లోu చక్రపాణి వెల్లడించారు. బుధవారం విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ పరీక్షలు కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 46 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, మొత్తం 12,689 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 11 కేంద్రాల్లో 2,922మంది, మంచిర్యాల జిల్లాలోని 14 కేంద్రాల్లో 3,375 మంది, నిర్మల్ జిల్లాలో 11 కేంద్రాల్లో 3,328 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 10 కేంద్రాల్లో 3,064 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ పరీక్ష ఉ ర్దూ, హిందీ, తెలుగు, మరాఠీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో నిర్వహిస్తామన్నా రు. ఈ మేరకు ప్రశ్నపత్రాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని బ్యాంకులకు చేరుకున్నాయని తెలిపారు. పరీక్ష నిర్వహణకు పరిశీలకులుగా 60 మం దిని కలెక్టర్ల ఆధ్వర్యంలో నియమించినట్లు వివరించారు. నాలుగు జిల్లాల డీఈవోల పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగనుందని చెప్పారు.
ప్రవేశ పరీక్ష నిర్వహణపై నేడు, రేపు శిక్షణ
కేంద్రీయ జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణపై ఈ నెల 5న మంచిర్యాల, కాగజ్‌నగర్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అదే విధంగా ఈ నెల 6న నిర్మల్, ఆదిలాబాద్ కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నా రు. సంబంధిత అధికారులు, సిబ్బందిహాజరు కావాలని సూచించారు.