కళాశాలలో ప్రొఫెసర్ సాహసం
అలహాబాద్ : నగరంలోని ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్ సాహసం చేశారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ డిగ్రీ కళాశాలలోని బోటనీ డిపార్ట్మెంట్లో ఎన్బీ సింగ్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం డిపార్ట్మెంట్ గదిలో ఉన్న ఆయనకు ఓ విద్యార్థి నుంచి ఫోన్ వచ్చింది.
కళాశాల పరిసర ప్రాంతాల్లోకి కొండచిలువ వచ్చిందని దాని సారాంశం. అంతే అక్కడి నుంచి హుటాహుటిన కొండచిలువ ఉన్న చోటుకు చేరుకున్న ఎన్బీ సింగ్.. 40 కిలో బరువున్న పామును అవలీలగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు.
ఎన్బీ సింగ్ ఇప్పటివరకూ 12 పాములను చేతులతో పట్టుకున్నారు. దీనిపై మాట్లాడిన ఎన్బీ సింగ్.. కొండచిలువలు మిగతా పాముల్లో ప్రమాదకరమైనవి కావని ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే పాములు పట్టడం ప్రారంభించానని చెప్పారు. వాటికి ఉద్రేకం తెప్పిస్తే కొండచిలువలు ఎవరిపైనా దాడి చేయవని తెలిపారు.