19 నుంచి ఎన్బీఏ బృందం పర్యటన
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని విభాగాల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) బృందం పర్యటించనుంది. ఈనెల 19, 20, 21 తేదీల్లో విభాగాల వారీగా పరిశీలించనుంది. ప్రతి విభాగానికీ ఇద్దరు నిపుణలు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.