అందరికీ న్యాయ సహాయం
యాకుత్పురా: పారా లీగల్ వలంటీర్లందరూ ఇచ్చిన సూచనల ప్రకారం ప్రజలం దరికీ న్యాయ సహాయం అందించేందుకు కృషి చేయాలని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి ఎన్.బాలయోగి సూచించారు. పురానీహవేలిలోని న్యాయసేవ సదస్సులో తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం పారా లీగల్ వాలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
65 మంది పారా లీగల్ వలంటీర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి ఎన్ .బాలయోగి మాట్లాడుతూ... బస్తీలు, కాలనీల్లో వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు పారా లీగల్ లంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారికి న్యాయం చేకూర్చే విధంగా పని చేయాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ఏదైన సంఘటన జరిగినప్పుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు, కుటుంబ తగాదాలు తదితర అంశాలతో ఇబ్బందులు పడుతూ న్యాయ సహాయం కోరే వారికి వలంటీర్లు చేయూతనివ్వాలన్నారు. సదస్సులో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ చార్జి సభ్య కార్యదర్శి పీవీ రాంబాబు, అడ్మినిసే్ట్రటివ్ ఆఫీసర్ శ్రీనివాస శివరాం, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వై.వీర్రాజు, న్యాయవాదులు ఎస్.వేణుగోపాల్, మంజుష, విజేత తదితరులు పాల్గొన్నారు.