ముగ్గురు టెర్రరిస్టులను కాల్చిచంపిన ఆర్మీ
కొక్రాఝర్: ముగ్గురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్(ఎన్డీఎఫ్బీ) కు చెందిన టెర్రరిస్టును హతం చేసింది. ఇండియన్ ఆర్మీకి ఎన్డీఎఫ్బీకి మధ్య ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదుల హతమయ్యారు. అస్పాంలోని కొక్రాఝర్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ఇరువర్గాలు ప్రత్యర్థులపై పలుమార్లు కాల్పులు జరుపుకున్నాయి. ప్రత్యర్థుల దాడులను చాకచక్యంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ బృందాలు టెర్రరిస్టులను మట్టుపెట్టాయి. టెర్రరిస్టుల నుంచి నాలుగు పిస్టల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు మరికొంత యుద్ధ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నాయి.