Nedcap
-
AP: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ–స్కూటర్లు అందించనున్న ప్రభుత్వం
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఈ సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహన కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ–స్కూటర్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని అందించనుంది. కొనుగోలు చేసిన ఈ–స్కూటర్లకు ఒకేసారి కాకుండా 60 నెలల పాటు వాయిదాల పద్ధతిలో (ఈఎంఐ) డబ్బులు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగులు సైతం ఈ–స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఆ సంస్థ నిర్వాహకుడు (మేనేజర్, సీఈఓ తదితర) సదరు ఉద్యోగి నుంచి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) అధికారులు సిద్ధం చేశారు. ఈ–స్కూటర్లు అందుబాటులోకి వస్తే.. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకోగానే 3 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు.. రోజంతా ఈ–స్కూటర్ నడుపుకోవచ్చు. పైగా పెట్రోలు భారం కూడా తప్పుతుంది. 10 వేలకు పైగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే సుమారు 10 వేలకు పైగా ఈ–స్కూటర్లు, ఈ–కార్లు ఉన్నాయి. వీటి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకసారి కారుకు రీచార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంటుంది. ఇప్పటి వరకూ కారుకు 6 గంటల పాటు చార్జ్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం 45 నిమిషాల్లోనే చార్జ్ చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రాజమహేంద్రవరంలో టాటా సంస్థ రెండు చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. మిగతా వాటి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉద్యోగులకు ప్రాధాన్యం విద్యుత్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటిని తొలుత ప్రభుత్వోద్యోగులకు ఇస్తాం. అనంతరం నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు ఉద్యోగులకు విక్రయిస్తాం. ఈ వాహనాల ద్వారా వాయు, శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు. త్వరలో జిల్లాకు వాహనాలు వచ్చే అవకాశం ఉంది. వివరాలకు నెడ్కాప్ డీఎంను 9000 550 972, డీఓను 99 899 49 144 నంబర్లలో సంప్రదించవచ్చు. – జి.సత్యనారాయణ, జిల్లా మేనేజర్, నెడ్‌క్యాప్ -
NED క్యాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కేకే రాజు
-
‘రూఫ్ టాప్ సోలార్’ జగడం!
సాక్షి, హైదరాబాద్: కార్యాలయాల పై కప్పులపై (రూఫ్ టాప్) సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవహారం రెండు ప్రభుత్వ సంస్థల మధ్య వివాదం రేపుతోంది. ఈ విధానాన్ని ప్రోత్సహించాలని సంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదన విభాగం(నెడ్‌క్యాప్) కసరత్తు చేస్తుంటే, భద్రతపరంగా దీన్ని స్వాగతించలేమని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్) అంటున్నాయి. రాష్ట్రంలో రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానళ్లు ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలను నెడ్‌క్యాప్ గుర్తించింది. నెట్ మీటరింగ్ ఏర్పాటు కోసం డిస్కమ్‌లకు ప్రతిపాదనలు పంపింది. భద్రతపరమైన అంశాలను పరిశీలించే విభాగం సమగ్ర నివేదిక ఇవ్వకుండా దీన్ని అంగీకరించలేమని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి. టార్గెట్లు పూర్తి చేయాలని నెడ్‌క్యాప్ తొందపడుతుండగా, ప్రాణభయం ఉందంటూ అడ్డుకోవడానికి డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. డిస్కమ్‌ల లైన్లకే సోలార్ విద్యుత్ వెళ్తుంది. ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను డిస్కమ్‌లే కొనుగోలు చేయాలి. కాబట్టి వాటి నుంచి అనుమతి తప్పనిసరి. కానీ, డిస్కమ్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పంచాయితీ కేంద్ర ఇంధన శాఖకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. డిస్కమ్‌ల అభ్యంతరాలను కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాసేందుకు నెడ్‌క్యాప్ సన్నాహాలు చేస్తోంది. -
నెడ్‌క్యాప్ టెండర్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం
-
రైతు బతుకులో ‘సౌర’ వెలుగులు
- అందుబాటులో సౌర పంపుసెట్లు - నెడ్‌క్యాప్, ట్రాన్స్‌కో శిక్షణ శిబిరాలు అనకాపల్లి: రైతుల విద్యుత్ కష్టాలకు త్వరలో తెర పడనుంది. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా సౌర విద్యుత్ వినియోగంపై అధికారులు సమాయత్తమవుతున్నారు. సౌర విద్యుత్ తో పనిచేసే నీటి పంపుల వినియోగంలో రైతులకు ఎదురయ్యే లాభనష్టాలను అంచనా వేసుకొని, పూర్తిస్థాయి వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ కోత, వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్‌ను దృష్టిలో ఉంచుకొని సంప్రదాయ వనరులైన పవన, సౌరశక్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని పాలకులు, అధికారులు గుర్తించారు. పరిశ్రమలకు తోడు, గృహావసరాల విద్యుత్ సరఫరాకు డిమాండ్ పెరగడంతో ఆ ప్రభావం వ్యవసాయ రంగానికి సరఫరా చేసే విద్యుత్‌పై పడింది. దశల వారీగా వ్యవసాయ రంగానికి కేటాయించే విద్యుత్ వేళలను కుదించడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఏడు గంటల పాటు సరఫరా చేసే విద్యుత్‌ను సైతం లోడింగ్‌ను బట్టి ఫీడర్ల వారీగా రెండు విడతలుగా సరఫరా చేయడంతో ఉపయోగం ఉండదని రైతుల వాదన. దీంతో రైతులకు అవగాహన కల్పించి, రాయితీపై సౌర విద్యుత్‌ను అందించేందుకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (నెడ్‌క్యాప్) ముందుకొచ్చింది. ప్రయోగాత్మకంగా శిక్షణ శిబిరాలు నెడ్‌క్యాప్, ట్రాన్స్‌కో శాఖలు ఎంపిక చేసిన రైతులకు సౌర నీటి పంపుల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. దీనికి ఇప్పటికే రెండు శాఖల అధికారులు వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాల శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించారు. ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 15వ తే దీన 300 మంది రైతులకు సౌర నీటి పంపుసెట్ల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించాలని భావించారు. అనివార్య కారణాలతో వాయిదా వేసిన ఈ సదస్సును ఈ నెల 18న నిర్వహించే అవకాశం ఉంది. సౌర విద్యుత్ పంపుసెట్లకు అవసరమైన మోటార్లు, ప్యానెల్స్‌ను సరఫరా చేసే వివిధ సంస్థలు అవగాహన సదస్సులో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దశల వారీగా సౌర విద్యుత్ పంపుసెట్లను వినియోగంలోకి వస్తే రైతులకు విద్యుత్ కష్టాలు తీరినట్లే.