Nedurumalli Janardhana Reddy
-
నేదురుమల్లి జనార్ధనరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
-
వైఎస్సార్సీపీలో చేరిన రామ్ కుమార్ రెడ్డి
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు
సాక్షి, పెందూర్తి : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కండువా కప్పి రామ్‌కుమార్‌ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. ఆ నమ్మకాన్ని వైఎస్ జగన్ నిలబెడతారు: రామ్ కుమార్ ప్రజలకు రాజకీయ నాయకులపై ఉండాల్సింది అభిమానం, నమ్మకమని ఇవి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నెలకొల్పారని నేదురుమల్లి రామ్‌కుమార్ అన్నారు. మళ్లీ ప్రజలకు రాజకీయ నాయకులపై నమ్మకం రావాలంటే అది జననేత వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఉన్న రెండు ఆప్షన్స్‌లో ప్రజలు అనుభవం వైపు మొగ్గు చూపారన్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల సీఎం చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, ఈ సారి వైఎస్ జగన్‌కు అవకాశమివ్వాలని యోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దీంతోనే నేదురుమల్లి వర్గంతో మాట్లాడి పార్టీలో చేరడం జరిగిందన్నారు. జనార్థన్ రెడ్డి, వైఎస్సార్‌లు చాలా సన్నిహితంగా ఉండేవారని, వారి చాలా దగ్గరి నుంచి చూశానని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. జనార్థన్ రెడ్డి తన చివరి ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేశారని, లక్ష 75 వేల ఓట్లతో గెలుపొందారని తెలిపారు. నెల రోజుల క్రితమే పార్టీలో చేరాలనుకున్నా.. పాదయాత్ర విశాఖ చేరేవరకు ఎదురుచూశానని పేర్కొన్నారు. -
రఘువీరాపై నేదురుమల్లి కుమారుడు ఆగ్రహం
నెల్లూరు : ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఇందిరా భవన్‌ను డీసీసీకి అప్పగించటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ సమావేశంలో నేదురుమల్లికి నివాళులు అర్పించకపోవటం బాధాకరమని రాంకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేదురుమల్లి హయాంలో ఏర్పాటు చేసిన ఇందిరా భవన్‌పై ట్రస్టీకి పూర్తి హక్కులు ఉంటాయన్నారు. సోనియాను కలిసిన తర్వాతే ఇందిరా భవన్‌పై స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. -
నేదురుమల్లికి కన్నీటి వీడ్కోలు
వాకాడు (నెల్లూరు జిల్లా), న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం వాకాడులోని ఆయన ఇంటి ఆవరణలో పార్థివదేహాన్ని ఉంచారు. వేలాదిమంది అభిమానులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జనార్దన్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర 5.10కి స్వర్ణముఖి నది వద్ద శ్మశానవాటికకు చేరుకుంది. జనార్దన్‌రెడ్డి చితికి ఆయన పెద్దకుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి నిప్పంటించారు. హాజరైన పలువురు ప్రముఖులు: మాజీ సీఎం జనార్దన్‌రెడ్డి అంత్యక్రియలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి జేడీ శీలం, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, చింతామోహన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సినీనటుడు మోహన్‌బాబు దంపతులు, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, సీవీ శేషారెడ్డి, టీడీపీ నేతలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ముంగమూరు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ రాజారామిరెడ్డి హాజరయ్యారు. -
అధికార లాంఛనాలతో జనార్దనరెడ్డి అంత్యక్రియలు
నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి అంత్యక్రియలు స్వర్ణముఖి నది తీరాన అధికార లాంఛనాలతో జరిపారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేదుమల్లి నిన్న ఉదయం నిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నేదురుమల్లి జనార్దనరెడ్డి అంత్యక్రియలకు సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి తదితరులు హాజరయ్యారు.