
నేదురుమల్లి జనార్దనరెడ్డి
నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి అంత్యక్రియలు స్వర్ణముఖి నది తీరాన అధికార లాంఛనాలతో జరిపారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేదుమల్లి నిన్న ఉదయం నిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
నేదురుమల్లి జనార్దనరెడ్డి అంత్యక్రియలకు సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి తదితరులు హాజరయ్యారు.