నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: రాజేష్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్రా ణాలు కోల్పోయిన వారి మృతదేహాల కు మంగళవారం వారి సొంతూర్లలో అంత్యక్రియలు జరిగాయి. ఆత్మీయుల మృతదేహాలను వారి కుటుంబసభ్యు లు, బంధుమిత్రులు కడసారి దర్శించుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అనూష్, మానస్‌కుమార్ మృతదేహాలకు నెల్లూరులో, చిన్నం ప్రసాద్‌కు వావింటపర్తిలో, ప్రదీప్‌కు గూడూరులో అంత్యక్రియలు నిర్వహించారు. విజ యకుమార్ మృతదేహానికి బుధవారం నెల్లూరులో నిర్వహించనున్నారు.
కడచూపునకు నోచుకుని
అనూష భర్త
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదు నెలల గర్భిణి అనూష మృతదేహన్ని కడసారి చూసే అవకాశం భర్త శ్రీకాంత్‌కు లభించలేదు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అనూష మృతదేహానికి మంగళవారం నెల్లూరులో అంత్యక్రియలు జరిగాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మద్దులూరుకు చెందిన ముప్పా చెంచురామయ్య, ఇంద్రావతికి ముగ్గురు కుమార్తెలు. చివరి బిడ్డ అయిన అనూషను చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన అనూషకు గత ఏడాది మే 25న నెల్లూరు నేతాజీనగర్‌కు చెందిన శ్రీకాంత్‌తో వివాహైంది. శ్రీకాంత్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తలు బెంగళూరులోని టిన్‌ఫ్యాక్టరీ సమీపంలో కాపురం పెట్టారు. ప్రస్తుతం అనూష ఐదో నెల గర్భిణి. పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి కావడంతో భార్యాభర్తలు ఈ నెల 13వ తేదీన మద్దులూరు వెళ్లారు.
మూడు రోజుల పాటు అక్కడే సంతోషంగా గడిపి 17వ తేదీ నెల్లూరుకు చేరుకున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రుల వద్ద రెండు రోజులు గడిపిన తర్వాత ఆదివారం రాత్రి రాజేష్ ట్రావెల్స్ బస్సులో తిరుగుప్రయాణమై ప్రమాదానికి గురయ్యారు. అనూష సంఘటన స్థలంలోనే మృతిచెందగా, శ్రీకాంత్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం రాత్రి అనూష మృతదేహాన్ని నెల్లూరులోని అత్తింటికి తీసుకొచ్చారు. మంగళవారం ఇరు కుటుంబసభ్యులు ఆమెకు నెల్లూరులోదహనసంస్కారాలు పూర్తి చేశారు. శ్రీకాంత్ కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయాడని బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆత్మీయులకు కన్నీటి వీడ్కోలు
Published Wed, Jan 22 2014 4:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement