గర్భిణిని బలితీసుకున్న డెంగ్యూ | The death of a pregnant woman | Sakshi
Sakshi News home page

గర్భిణిని బలితీసుకున్న డెంగ్యూ

Published Sat, Oct 24 2015 10:48 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

The death of a pregnant woman

నవమాసాల గర్భంతో ఉన్న ఓ మహిళను డెంగ్యూ జ్వరం పొట్టన పెట్టుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో నివసించే కొప్పుల ప్రమీల (24) తొమ్మిది నెలల గర్భవతి. ఆమె భర్త వెంకట కిష్టయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఏడాది వయసున్న బాబు ఉన్నాడు.

కాగా, తొమ్మిది నెలల గర్భంతో ఉన్న ప్రమీలను పుట్టింటివారు పెళ్లకూరు మండలం అర్ధమాలకు ఈ నెల 19న తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు జ్వరం రావడంతో శ్రీకాళహస్తిలోని ఓ ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం జ్వర తీవ్రత అధికం కావడంతోపాటు కడుపులో నొప్పి వస్తుండడంతో ఆమెను రుయా ఆస్పత్రిలో చేర్పించారు.  చికిత్స పొందుతున్న ప్రమీల శనివారం మృతి చెందింది.

అయితే, ఆచారం ప్రకారం కాలనీలోకి తీసుకెళ్లేందుకు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామం బయటే టెంట్‌లో ఉంచి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement