ఢిల్లీలో డెంగీ విషాదం | Lament dengue in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో డెంగీ విషాదం

Published Sun, Sep 13 2015 12:43 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Lament dengue in Delhi

కొడుకు మృతితో తల్లిదండ్రుల ఆత్మహత్య

న్యూఢిల్లీ: ఒక్కగానొక్క కొడుకు డెంగీతో చనిపోవడం తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలోని లాడోసరాయ్‌లో జరిగింది. బిడ్డ అంత్యక్రియలు నిర్వహించిన 24గంటల్లోపే వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఒడిశాకు చెందిన లక్ష్మీచంద్, బబితలు కొన్నేళ్లుగా లాడోసరాయ్ ఉంటున్నారు. ఇటీవల వారి కొడుకు అవినాశ్(7)కు డెంగీ సోకింది. దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్సచేసినా తగ్గలేదు. రెండు ఆస్పత్రులు పడకల్లేవని చేర్చుకోలేదు. 

మరో ఆస్పత్రిలో చేర్పించారు. వ్యాధి తీవ్రం కావడంతో అవినాశ్ సెప్టెంబర్ 8న చనిపోయాడు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించిన తల్లిదండ్రులు.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి దగ్గర్లోని పాఠశాలలో మృతదేహాలు లభ్యమయ్యాయి.  ఇద్దరూ చేతులు కట్టేసుకుని భవంతి పై నుంచి దూకారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement