
ప్రేమలత (ఫైల్ ఫోటో)
సాక్షి, పూతలపట్టు(చిత్తూరు రూరల్): ప్రేమలత అంత్యక్రియలను ఆదివారం అమెరికాలోనే పూర్తిచేశారు. పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన ప్రేమలత అమెరికాలో గత మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం కోసం ప్రేమలత కుటుంబ సభ్యులు నాలుగు రోజులుగా నిరీక్షించారు. తమ కుమార్తె మృతదేహం కావాలని ప్రేమలత భర్త, మామతో పట్టుబట్టారు. కడసారి చూపు చాలంటూ రోదించారు.
కోవిడ్–19 కారణంగా చూపి అత్తంటివారు.. తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాలేతున్నామని చెబుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు వివరించారు. మన దేశ సమయం ప్రకారం 9 గంటల ప్రాంతంలో అంత్యక్రియలను అక్కడ ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం దహన క్రియలను పూర్తి చేశారు. జూమ్ లింక్ సాయంతో ప్రేమలత అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధువులు వీక్షించారు. ఈ క్రమంలో మృతిరాలి ఇంటి వద్ద రాత్రి విషాదచాయాలు అలుముకున్నాయి. చివరి చూపు కూడా దూరమైందని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి)
Comments
Please login to add a commentAdd a comment