Rua Hospital
-
రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు
సాక్షి, అమరావతి: రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి ఎక్కడా పునరావృతం కాకూడదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని ఆదేశించారు. కోవిడ్ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అనంతరం సీఎం జగన్.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల తిరుపతి రుయా, విజయవాడ ఆస్పత్రుల్లో చోటుచేసుకున్న ఘటనలపై అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదు నంబర్లు స్పష్టంగా కనిపించాలి ► ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రల కియోస్క్‌ల వద్ద ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు అన్నీ స్పష్టంగా డిస్ప్లే చేయాలి. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లాంటి వాహనాల మీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలి. ఎవరికైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ► ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. ఇకపై ఆ పరిస్థితి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలి. విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలి. ► అలసత్వం వహించారనే కారణంతోనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్ని వేళలా మంచి చేయాలి. ఇందు కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు కట్టుదిట్టంగా అమలు కావాలి. విద్య, వైద్యం–ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి. ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే. ► ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం స్పెషల్ సీఎస్ కే ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యపు డ్రైవింగే కొంప ముంచింది
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై శనివారం రాత్రి భాకరాపేట ఘాట్‌లో పెళ్లి నిశ్చితార్థం కోసం వస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 300 అడుగులకు పైగా ఉన్న లోయలో బస్సు ఐదు పల్టీలు కొట్టి, పెద్ద పెద్ద బండ రాళ్లను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు తోడు అతి వేగం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన డ్రైవర్ రసూల్‌బాషా (47), క్లీనర్ షకీల్ (25), మలిశెట్టి గణేష్ (40), మలిశెట్టి మురళి (45), మలిశెట్టి వెంగప్ప (60), లక్ష్మీకాంతమ్మ (40) ఘటన స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యశస్విని (8) ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ జర్నలిస్ట్ ఆదినారాయణరెడ్డి (45), నాగలక్ష్మి (60) ఆదివారం మృతి చెందారు. మరో 43 మంది క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎముకలు విరిగిన 22 మందికి బర్డ్ ఆస్పత్రిలో, శస్త్రచికిత్సలు అవసరం అయిన 12 మంది స్విమ్స్‌లో, మరో 9 మందికి రుయాలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆర్తనాదాలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 45 మందిని (మొత్తం 52 మంది) శనివారం అర్ధరాత్రి తిరుపతిలోని రుయా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాలు విరిగి ఒకరు, ముఖంపై రాడ్లు గుచ్చుకుని రక్తం ధారలు కారుతూ మరొకరు, రెండు చేతులూ విరిగి, కాలు తెగి అల్లాడిపోతూ ఇంకొకరు.. బాధతో చేస్తున్న ఆర్తనాదాలు చూపరుల కంట నీరు తెప్పిస్తున్నాయి. చికిత్స పొందుతూ ఆదివారం వీరిలో ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొడుకు వేణు తీవ్ర గాయాలతో తల్లిదండ్రులు, బంధువుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు పడుతున్న ఆరాటం అయ్యో.. అనిపిస్తోంది. డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి, ధర్మవరం ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ శ్రీహరి, వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులతో నేరుగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లా మంత్రులు, అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో అత్యధికులు చేనేత కుటుంబాలకు చెందిన వారని, వారికి అండగా ఉంటామని సీఎం ప్రకటించారని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు చెప్పారు. కాగా, గాయపడిన వారి అభ్యర్థన మేరకు మరింత ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. మృతదేహాలకు తిరుపతి ఎస్వీ మెడికల్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రుయాలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బస్సు కండిషన్ ఓకే.. అతివేగమే కారణం భాకరాపేట ఘాట్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంపై లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ బసిరెడ్డి, తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ప్రాంతీయ రవాణా శాఖాధికారి సీతారామిరెడ్డి, ఆర్అండ్బీ (జాతీయ రహదారులు) డీఈ సత్యమూర్తి ఆధ్వర్యంలోని బృందం ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. బస్సు కండీషన్ బాగానే ఉందని, డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్ల స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో మలుపు వద్ద లోయలో పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అధికారులు తెలిపారు. ధర్మవరం కన్నీటి సంద్రం అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం ధర్మవరం టౌన్/అర్బన్ : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు బోల్తా ఘటనతో అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని నేసే పేటకు చెందిన సిల్క్ హౌస్ యజమాని మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్ (పట్టు చీరల వ్యాపారి), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు మురళి కుమారుడు వేణు (పెళ్లి కొడుకు) గాయపడడంతో ఆ ఇంట తీవ్ర విషాదం అలముకుంది. మలిశెట్టి మురళి బంధువైన మలిశెట్టి వెంగప్ప (పెళ్లిళ్ల పేరయ్య), అతని భార్య నాగలక్ష్మి కూడా చనిపోయారు. మరో బంధువు జింకా చంద్ర కుమార్తె చందన (నాలుగవ తరగతి) మృతి చెందింది. పట్టణంలోని మారుతీనగర్‌లో నివసించే బస్సు డ్రైవర్ నబీరసూల్, శాంతినగర్‌లో ఉండే బస్సు క్లీనర్ షకీల్ (ఇంకా వివాహం కాలేదు) చనిపోయారు. ఇదే ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణరెడ్డి సైతం మృత్యువాత పడ్డారు. ఈయన స్వగ్రామం బుక్కపట్నం మండలం మారాల. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో అతని కుమారుడి నిశ్చితార్థానికి వెళుతూ ప్రమాదంలో చనిపోయాడు. ఆదివారం వీరి మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారి అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని భాకారాపేట వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనపై ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మృతుల బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్ బస్సు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చిత్తూరు జిల్లా అధికార యాంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి తిరుపతి సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను ఆదివారం ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌లు ఈ ఘటనపై వేర్వేరు ప్రకటనల ద్వారా సానుభూతి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, బస్సులకు వేగ పరిమితి విధించాలని పవన్ కల్యాణ్ సూచించారు. -
రుయా మరణాలపై పిల్‌ను పరిష్కరించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: కరోనాకు చికిత్స పొందుతూ తిరుపతి రుయా ఆసుపత్రిలో పలువురు రోగులు మృతి చెందిన ఘటనపై ప్రత్యేక విచారణ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కన్నా ఎక్కువ మంది మృతులుంటే ఆ వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలకు అందచేయవచ్చునని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. పోలీసుల దర్యాప్తులో న్యాయం జరగలేదని భావిస్తే పిటిషనర్ తిరిగి కోర్టుకు రావొచ్చునంది. ప్రభుత్వ పరిహారంపై అభ్యంతరాలుంటే బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించవచ్చునంటూ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రుయా ఆసుపత్రి ఘటనలో బాధ్యులైన అధికారులు, ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఆక్సిజన్ సరఫరాదారు అలసత్వమే కారణం
సాక్షి, అమరావతి: శ్రీ భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ అలసత్వం వల్లే.. సకాలంలో ఆక్సిజన్ అందక తిరుపతి ‘రుయా’ ఘటన జరిగిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. మరణాలకు కారణమైన సదరు కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు ఉత్తర్వులిచ్చినట్లు ప్రభుత్వం వివరించింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు చనిపోయిన ఘటనకు బాధ్యులైన అధికారులు, యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను తమ ముందుంచాలని ఆదేశాలిచ్చింది. దీంతో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ అఫిడవిట్ దాఖలు చేశారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రుయా ఘటన
సాక్షి, అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు మరణించిన ఘటనపై చిత్తూరు కలెక్టర్ మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాధితులు మరణించారని తన నివేదికలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామి వివరించారు. అలాగే ఆక్సిజన్ పీడనం తగ్గినప్పుడు అప్రమత్తం చేసే అలారం పనిచేయలేదని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు మరణించిన ఘటనలో బాధ్యులైన అధికారులు, ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత, శాప్ మాజీ చైర్మన్ మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య.. నిందితుడి అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏడడుగులు.. మూడు ముళ్ల బంధం.. అగ్నిసాక్షిగా మనువాడి కడదాకా తోడుంటానన్న భర్తే.. ఆమె పాలిట కాల యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. మరోవైపు ఏ పాపం తెలియని ఆ చిన్నారి ఇకముందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగలింది. ఉద్యోగం లేకపోయిన భర్త అడగగానే డబ్బు ఇవ్వడమే ఆమెకు శాపమై తన ప్రాణం తీసింది. కట్టుకున్న వాడే కిరాతకంగా కడతేర్చాడు తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులోని మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో ఆమె భర్త శ్రీకాంత్‌రెడ్డి నిందితుడిగా నిర్థారణ కావడంతో పోలీసులు ఆ కిరాతకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వరి ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి భర్తకు ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 22న భువనేశ్వరిని ఆమె భర్త శ్రీకాంత్ కిరాతకంగా చంపి సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో సూట్‌కేసులో భార్య మృతదేహాన్ని తీసుకెళ్లి రుయా ఆస్పత్రి వెనుక తగలబెట్టాడు. అలానే వారి బంధువులకు అనుమానం రాకుండా కరోనాతో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
వీడిన తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసు
తిరుపతి క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక దహనం చేసిన ఓ భర్త దుర్మార్గమిది. బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు తన భార్యకు కరోనా వచ్చిందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. ఆ తర్వాత డెల్టా వేరియంట్‌తో మృతి చెందిందంటూ కట్టుకథలు చెప్పాడు. కరోనాతో మరణించడం వల్ల మృతదేహం కూడా ఇవ్వలేదని వాపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కూడా నిజమని నమ్మారు. అయితే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. తిరుపతి అర్బన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రామసముద్రానికి చెందిన భువనేశ్వరి (27)ని రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోం చేస్తూ తిరుపతిలోని ఓ అపార్టుమెంట్లో భర్తతో కలిసి నివసిస్తోంది. శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి అతడికి ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో ఆమెను హత్య చేశాడని తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో.. ఈ నెల 23న తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక పోలీసులకు కాలిన మృతదేహం లభించింది. దీంతో సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలిని భువనేశ్వరిగా గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా రుయా ఆస్పత్రికి వచ్చిన ఓ డ్రైవర్‌ను అలిపిరి పోలీసులు గుర్తించి విచారించారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. వెబ్సైట్లో శ్రీకాంత్‌రెడ్డి కారును బుక్ చేసుకున్నాడని డ్రైవర్ తెలిపాడు. ఓ పెద్ద సూట్‌కేసును తెచ్చి తన భార్య రుయా ఆస్పత్రిలో పెద్ద డాక్టర్ అని, ప్రస్తుతం తనకు కరోనా సోకిందని తెలిపాడు. సూట్‌కేసులో వెంటిలేటర్ ఉందని డ్రైవర్‌ను నమ్మించాడు. అనంతరం ఆస్పత్రి వెనుక ముళ్ల పొదల వద్ద డ్రైవర్‌కు అనుమానం రాకుండా కారును ఆపమని చెప్పి సూట్ కేసును అక్కడ దించాడు. డ్రైవర్ ప్రశ్నించడంతో మేడమ్‌కు కరోనా వచ్చిందని.. ఇక్కడ పెట్టి వెళ్తే ఈ వెంటిలేటర్‌ను ఆమె తీసుకుంటుందని చెప్పాడు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి ఇంట్లో భార్యని హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. కారులో మృతదేహాన్ని తెచ్చి రుయా ఆస్పత్రి వెనుక తగులబెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సూట్ కేసుని కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. డెల్టా వేరియంట్‌తో మరణించిందని.. బంధువుల వద్ద శ్రీకాంత్‌రెడ్డి ఆడిన డ్రామా కూడా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని.. రుయా ఆస్పత్రిలో చేర్చానని కుటుంబ సభ్యులను, బంధువులను శ్రీకాంత్ నమ్మించాడు. అనంతరం భువనేశ్వరి మరణించిందని.. కరోనాతో మృతి చెందడం వల్ల మృతదేహాన్ని ఇవ్వడం లేదని కట్టుకథ చెప్పాడు. అంతేకాకుండా బంధువులను రుయా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలన్నింటినీ వెదికినట్టు నటించాడు. కాగా, నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు బృందాలు తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఆరా తీస్తున్నాయి. -
భయం వద్దు.. ధైర్యమే సగం బలం
తిరుపతి తుడా: కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యమే సగం బలం అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలోని రుయా ఆస్పత్రిని సందర్శించారు. పీపీఈ కిట్ ధరించి వచ్చిన భూమన కోవిడ్‌కు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు సేవలు అందిస్తున్నారని, ఎన్నో జీవితాలను నిలబెడుతున్న వైద్యులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వారిని విమర్శిస్తే దేవుడిని విమర్శించినట్లేనని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మించి రుయాలో రికవరీ రేట్ నమోదైందని తెలిపారు. సుమారుగా 100 మంది కరోనా బాధితులను నేరుగా పలకరించినట్లు చెప్పారు. వైద్యం పట్ల, వసతుల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్‌రాయల్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు. -
రెండ్రోజుల్లో 9 మంది చిన్నారులకు కరోనా
తిరుపతి తుడా/పుత్తూరు రూరల్: కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వీరిలో వైఎస్సార్ జిల్లాకు చెందిన ముగ్గురు, చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురున్నారు. వీరంతా శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రంలోపు చేరిన వారే. వీరిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు రుయా అధికారులు తెలిపారు. రెండ్రోజుల వ్యవధిలో ఇంతమంది ఆస్పత్రిలలో చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులూ చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. పుత్తూరులో మరో ఎనిమిది మందికి.. ఇక పుత్తూరు పట్టణం పిళ్లారిపట్టులో పదేళ్లలోపు పిల్లలు ఎనిమిది మందికి కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించినట్టు వైద్య సిబ్బంది చెప్పారు. ఇటీవల వీరి తల్లిదండ్రులకు పాజిటివ్ రావడంతో వారి నుంచి పిల్లలకు సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. -
సహజ మరణాలపై రాజకీయం
సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో రోజువారీ సహజ మరణాలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. రెండురోజులుగా సహజంగా మరణించినవారు కూడా.. సోమవారం రాత్రి ఘటన కారణంగానే చనిపోయారంటూ విపక్షాలు ఆందోళన చేయటంపై రోగుల బంధువులు, వైద్యసిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ప్రభుత్వ రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి చెన్నై నుంచి ఆక్సిజన్ ఆలస్యంగా రావటంతో ఐదు నిమిషాల వ్యవధిలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ పునరుద్ధరించిన అనంతరం, మంగళవారం సహజంగా మరణించిన వారిని కూడా సోమవారం రాత్రి జరిగిన సంఘటనలో మరణాలేనని టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులు కొందరు రాద్ధాంతం చేశారు. కరోనా సెకెండ్ వేవ్ విజృంభణ మొదలైనప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో రోజూ 2 వేలకుపైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య అంతకుమించి ఉంటోంది. కరోనా బాధితులతో పాటు వివిధ అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో రోజూ కొందరు మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చిన ప్రతి కరోనా బాధితుడిని కాపాడేందుకు జిల్లా అధికారయంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు. పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 9 ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో 2,798 బెడ్లు, 36 ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,210 బెడ్లు, 7 కోవిడ్ కేంద్రాల్లో 3,974 బెడ్లు ఉన్నాయి. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెడ్లు కేటాయిస్తున్నారు. తేలికపాటి లక్షణాలున్న వారు హోం ఐసొలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విపక్షాల నిరసన.. రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతిచెందిన ఘటనపై ;్చజీ రాజకీయ పార్టీలు మంగళవారం నిరసనకు దిగాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తమ అనుచరులతో రుయా వద్ద నిరసన తెలిపారు. గుంపులుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా వ్యవహరించడం, విధుల్లో ఉన్న సిబ్బందికి ఆటంకం కలిగించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. తప్పుగా చెప్పాల్సిన అవసరం లేదు రుయాలో రోజూ పదుల సంఖ్యలో సహజ మరణాలు ఉంటాయి. మృతుల సంఖ్యను తప్పుగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్యసిబ్బంది వైఫల్యం ఎక్కడా లేదు. రోజూ రెండు ట్యాంకర్ల ఆక్సిజన్ అవసరం ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకు రావలసిన ట్యాంకర్ రాత్రి 8 గంటల సమయంలో వచ్చింది. ఎందుకు ఆలస్యం అయిందంటే రకరకాల కారణాలు చెబుతున్నారు. ఆలోపే బల్క్ సిలిండర్లతో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాం. ఆ సమయంలో 70 వెంటిలేటర్లు రన్ అవుతున్నాయి. దీంతో సమస్య తలెత్తింది. – భారతి, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
రుయా ఘటన తీవ్రంగా కలచివేసింది
కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. నిన్న (సోమవారం రాత్రి) తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆ ఘటనతో నాకు చాలా బాధ వేసింది. మనం ఎంత బాగా కష్టపడుతున్నప్పటికీ, మన తప్పు లేకపోయినప్పటికీ.. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోవడం వల్ల 11 మంది చనిపోవడం బాధాకరం. కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత తీసుకుంటున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రుయాలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రుయా ఘటనతో పాటు కోవిడ్–19 నియంత్రణ, చికిత్స, వ్యాక్సినేషన్ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుయా లాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, కలెక్టర్లు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాల్లో ఆక్సిజన్ వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ఎస్ఓఎస్.. ఎమర్జెన్సీ మెసేజ్ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే.. సమర్థవంతంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాల్లో ఆక్సిజన్ స్టోరేజీ కెపాసిటీలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా పరిశ్రమల్లో ఆ సదుపాయం ఉందా.. అన్నదానిపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే నేవీ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్తున్నాయని, ఈ సమయంలో వారు చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నేవీ బృందాల సేవలను బాగా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇది మనకు పరీక్షా సమయం ► కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల నుంచి మనకు ఆక్సిజన్ వస్తోంది. 3 రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను పంపిస్తున్నాం. ఆక్సిజన్ çసఫ్లై పెంచడంపై వీరు దృష్టి పెడతారు. తమిళనాడుకు కరికాల వలవన్, కర్ణాటకకు అనంతరాములు, ఒడిశాకు ఏకే పరీడాను పంపిస్తున్నాం. రేపటి (బుధవారం) నుంచి ఈ వ్యవస్థ పని చేస్తుంది. ► ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే... నిన్న (సోమవారం) 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌లిఫ్ట్ చేశాం. అక్కడ ఆక్సిజన్ నింపి.. రోడ్డు మార్గంలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ► విదేశాల్లో కూడా ఆక్సిజన్ కొనుగోలు చేసి.. షిప్స్ ద్వారా తెప్పిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పడు మనం ఉన్నాం. ఇంత సమష్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాల వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. ► ఇది మనకు పరీక్షా సమయం. కలెక్టర్లందరికీ చెబుతున్నా.. జరిగిన ఘటన పట్ల మీరు సడలిపోవాల్సిన పని లేదు. కానీ అత్యంత అప్రమత్తత, జాగరూకతతో వ్యవహరించాలి. ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో, సానుభూతితో ఎదుర్కోవాల్సి ఉంది. మన బాధ్యత కాకపోయినా, మానవత్వంతో.. ► నిన్నటి (సోమవారం) ఘటనలో మరణించిన వారందరికీ పరిహారం ఇస్తున్నాం. మన తప్పు కాకపోయినా, పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్ సకాలానికి రాకపోయినా సరే.. బాధ్యత తీసుకుని రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం. కలెక్టర్ గానీ, జేసీ గానీ వారి కుటుంబాల వద్దకు స్వయంగా వెళ్లి పరిహారం ఇవ్వండి. వారితో మాట్లాడి, ఓదార్చి ధైర్యం చెప్పండి. వారికి బాసటగా నిలవండి. ► తప్పు ఎవరి వల్ల జరిగినా తప్పు జరిగింది. ఇలాంటి తప్పులు మళ్లీ జరక్కుండా.. భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలి. తప్పును ఒప్పుకోవడం అన్నది చిన్నతనం కాదు. ప్రతి అడుగులోనూ పారదర్శకంగా వ్యవహరించే ప్రభుత్వం మనది. దేశంలో ఎలా ఉన్నా సరే.. మన రాష్ట్రంలో పారదర్శకతకు పెద్దపీట వేశాం. కోవిడ్ టెస్టుల్లో, ట్రీట్మెంట్లో ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామో దేశానికి చూపించాం. ప్రతి అడుగులోనూ పారదర్శకంగా ఉన్నాం. బెడ్లు.. సీసీసీలు ► రాష్ట్రంలో 648 ఆస్పత్రులను ఎంప్యానెల్ చేశాం. 47,947 బెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. 41,315 బెడ్లు భర్తీలో ఉన్నాయి. ఆస్పత్రి ఆవరణలో టెంపరరీ జర్మన్ హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఆస్పత్రిలో వేచిచూసే పరిస్థితులు ఉండవు. డాక్టర్లు వెంటనే వచ్చి వైద్యం చేసే అవకాశం ఉంటుంది. ► కోవిడ్ కేర్ సెంటర్లపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఆక్సిజన్ సఫ్లై గురించి అధికారులు ఆలోచించాలి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోలుపై దృష్టి పెట్టింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయి. ► ఆస్పత్రుల్లో ఉండే ఆక్సిజన్ పైపులైన్లను చెక్ చేయడంతో పాటు పర్యవేక్షణ చేయండి. టెక్నికల్ స్టాఫ్‌ను కచ్చితంగా నియమించండి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్ వెళ్లేలా చేయాలి. ఐసీయూలో కూడా ప్రెజర్ బూస్టర్స్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. 104 వ్యవస్థను ఓన్ చేసుకోవాలి ► 104 వ్యవస్థను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలి. 104కు అనుసంధానంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా వ్యవస్థ ఉండాలి. 104కు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదనే మాట రాకూడదు. సంబంధిత జేసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. 104కు కాల్చేస్తే మంచి సేవలు అందుతున్నాయనే ప్రజలు భావించాలి. ► మందులు ఇవ్వడం, క్వారంటైన్ సెంటర్లో చేర్పించడం, ఆస్పత్రుల్లో బెడ్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మన బాధ్యత. మొదటిసారి దేశంలో ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్సను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. 104కు కాల్చేస్తే ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ► 104 ద్వారా 16 వేల నుంచి 17 వేల కాల్స్ వస్తున్నాయి. కాల్స్ రిసీవ్ చేసుకునే కెపాసిటీని కూడా పెంచాం. దీనికి అనుగుణంగా జిల్లాల్లో అనుసంధాన వ్యవస్థల్లో వనరులను పెంచుకోవాల్సి ఉంటుంది. ► మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన ఆశిస్తారో.. అలాంటి స్పందనే యంత్రాంగం నుంచి ఉండాలి. టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్, ట్రాన్స్‌పోర్టేషన్.. ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలి. 3 గంటల్లో వారికి సేవలందించే బాధ్యత తీసుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ వైద్య సేవలు ► కోవిడ్ వైద్యం కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను కూడా తీసుకున్నాం. మంచి ఆహారం అందుతోందా? లేదా? మందులు సక్రమంగా అందుతున్నాయా? రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా? లేవా? సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారా? లేదా? చూడండి. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర ఉండేలా చూసుకోండి. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి నంబర్‌ను ఉంచండి. ► అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలని కోరాం. ఇక్కడ కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? చూడాలి. ప్రతి రెండు మూడు ఆస్పత్రులకు ఒక నోడల్ ఆఫీసర్ కచ్చితంగా ఉండాలి. 648 ఆస్పత్రులకు కచ్చితంగా నోడల్ అధికారులను నియమించాలి. ఆరోగ్య శ్రీ, ఆక్సిజన్ సఫ్లై ఆస్పత్రుల పనితీరు, శానిటేషన్, ఫుడ్ క్వాలిటీపై నోడల్ అధికారులు దృష్టి పెట్టాలి. మనకు నివేదికలు కూడా అందిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం తనిఖీలు చేపట్టాలి. వైద్యులను వెంటనే నియమించాలి. ఇందుకు వాక్ ఇన్ ఇంటర్వూ్యలను వెంటనే నిర్వహించండి. ► ఉదయం 6 నుంచి 12 వరకు ప్రజలు వారి పనులు చేసుకోవచ్చు. అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 12 గంటలు దాటిన తర్వాత నూరు శాతం కర్ఫ్యూ పాటించాలి. -
రుయా గుండె ఆగింది
తిరుపతి మెడికల్ : రుయా ఆస్పత్రికి రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలతోపాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల నుంచి నిత్యం 1,300 నుంచి 2 వేల మంది వరకు రోగులు వస్తుంటారు. ఇందులో బీపీతోపాటు గుండె జబ్బులతో బాధపడేవారు వంద మందికిపైనే ఉంటారు. వీరికోసం ఇక్కడ ఏర్పాటు చేసిన గుండె జబ్బుల విభాగానికి ప్రస్తుతం డాక్టర్లు కరువయ్యారు. ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉండాల్సి ఉంది. కానీ ఒక్క డాక్టరూ లేరు. వైద్యం కోసం వచ్చే రోగులు నరకయాతన పడుతున్నారు. ప్రత్యేక డాక్టర్ లేకపోయినా ఒకే ఒక చిన్న పిల్లల డాక్టర్‌తో మమ అనిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు గుండెపోటుకు గురై అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు పక్కనే ఉన్న స్విమ్స్ ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. భవనం చూస్తే గుండె జారిపోవాల్సిందే! రుయాలో గుండె జబ్బుల విభాగం 1986లో ప్రారంభమైంది. నాటి నుంచి ఈ విభాగాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం భవనం మొత్తం శిథిలావస్థకు చేరింది. కొన్ని గదులు నిర్మానుష్యంగా మారాయి. ఐసీయూ విభాగంలో తరచూ పైకప్పు ఊడిపడుతోంది. స్లాబు నుంచి మట్టి, రాళ్లు పడుతున్నాయి. భవనం కూలిపోతుందేమోనని రోగులు, వైద్యులు, సిబ్బంది బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విలువైన వైద్య పరికరాలు మూలనపడ్డాయి. కొత్త భవనం నిర్మించాలని చెప్పినా..! గత ఏడాది ఐఐటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన బృందంతో కలిసి గుండె జబ్బుల విభాగంలో సీలింగ్, గోడలను పరిశీలించారు. నిపుణుల సాయంతో సీలింగ్ పటిష్టంగా ఉందా లేదా, వాటి ఆయుష్షు ఎంత ఉందో స్వయంగా చూశారు. మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్లారు. భవనం శిథిలావస్థకు చేరిందని తేల్చారు. ఉన్నదాన్ని పడగొట్టి కొత్త భవనం నిర్మిచాలని చెప్పారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేరు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విభాగానికి మోక్షం కలగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీటీ సర్జన్ సేవలు నిరుపయోగం రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై అత్యవసర వైద్య సేవల కోసం పలువురు రోగులు వస్తుంటారు. ఇందులో పాలిట్రామా కేసుల్లో భాగంగా పక్కెటెముకలు విరగడం, తలకు గాయాలు, కాళ్లు, చేతులు విరిగి రక్తనాళాలు దెబ్బతినడం వంటి కేసులు అధికంగా ఉంటాయి. కార్డియాలజీ కేసులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్ చేయాలంటే ముందుగా కార్డియోథొరాసిక్ సర్జన్ (సీటీ సర్జన్) విభాగంలోని సేవలు చాలా కీలకం. రోగిని పరీక్షించి ఆపరేషన్‌కు రెఫర్ చేస్తుంటారు. దీనికోసం రుయాకు ఉస్మానియా నుంచి ఓ ప్రొఫెసర్ స్థాయి కార్డియా థొరా సిక్ సర్జన్ నియమించారు. కానీ ఆ విభాగమే లేకపోవడంతో కనీసం ఓపీ కూడా నిర్వహించలేని పరిస్థితి. -
విషాదం
ప్రమాదంలో ముగ్గురి మృతి ఇద్దరు వరుసకు అన్నదమ్ములు రెండు కుటుంబాల్లో విషాదం వారు వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. పెళ్లి కూడా ఇద్దరూ ఒకేసారి చేసుకున్నారు. ఒకే రకమైన వ్యాపారం చేస్తున్నారు. వారి అన్యోన్యతను చూసి విధి ఓర్వలేకపోయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి స్నేహితులతో కలిసి వెళుతుండగా బస్సు రూపంలో వచ్చి పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న వారి ఇద్దరి భార్యలూ చేస్తున్న రోదనలతో తిరుపతి రుయా ఆస్పత్రి దద్దరిల్లింది. వారి మృతితో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. రొంపిచెర్ల: మండలంలోని పెద్దగొట్టిగల్లు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. అలాగే బుధవా రం మరొక వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు పట్టణానికి చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు యాజమానులు వెంకటేశ్వరమూర్తి(30) ప్రసన్నకుమార్(30), స్నేహితులు మంజునాథ(35), నాగరాజ(30)తో కలిసి మారుతీ కారులో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం బయలుదేరారు. పెద్దగొట్టిగల్లు వద్ద బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో చైన్నై నుంచి కర్ణాటకలోని హోస్పేటకు వెళుతున్న మానస ట్రావెల్ బస్సు ఢీకొంది. వెంకటేశ్వరమూర్తి, ప్రసన్నకుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మంజునాథ, నాగరాజ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 ద్వారా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంజునాథ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతులు ఇద్దరు వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఒకే రోజు వివాహం చేసుకున్నారు. వారి భార్యలు భవ్య, చైత్ర గర్భవతులు. వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని వస్తామని వెళ్లిన వారు రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు బోరున విలపించారు. క్షతగాత్రు డు నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రహీముల్లా తెలిపారు. ప్రైవేటు బస్సును పోలీసులు సీజ్ చేశా రు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు వారు బెంగళూరుకు తీసుకెళ్లారు. -
తిరుమలలో పాముకాటుకు గురైన మహిళ
తిరుమలలోని ఈస్ట్ బాలాజీనగర్‌లో ఓ మహిళ ఆదివారం ఉదయం పాము కాటుకు గురైంది. 999వ నంబర్ క్వార్టర్లో నివసించే సుజిత ఇంటి ముందు పూలు కోస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే స్థానికంగా ఉన్న అశ్వనీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి బస్సుకు ప్రమాదం:15 మందికి గాయాలు
వేగంగా వెళ్తున్న పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తనపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు నుంచి పుత్తూరుకు వెళ్తున్నబస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది గాయాలపాలయ్యారు. వారందరినీ తిరుపతి రుయాకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం
తిరుమల ఘాట్‌రోడ్డులో మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్‌రోడ్డు ఆరో మలుపు వద్ద మారుతీ వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యానులో ఉన్న ఒక యువతికి గాయాలయ్యాయి. ఆమెను రుయా ఆస్పత్రికి తరలించారు. -
అత్యాచారానికి గురైన వృద్ధురాలి మృతి
మదనపల్లి పట్టణంలోని విజయనగర కాలనీలో అత్యాచారానికి గురైన 65 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తీవ్ర రక్తస్రావం వల్లే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలిపై శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వృద్ధురాలి కుమారుడు వెంకటాచలపతి(30) ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు వెంకటాచలపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
గర్భిణిని బలితీసుకున్న డెంగ్యూ
నవమాసాల గర్భంతో ఉన్న ఓ మహిళను డెంగ్యూ జ్వరం పొట్టన పెట్టుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో నివసించే కొప్పుల ప్రమీల (24) తొమ్మిది నెలల గర్భవతి. ఆమె భర్త వెంకట కిష్టయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. కాగా, తొమ్మిది నెలల గర్భంతో ఉన్న ప్రమీలను పుట్టింటివారు పెళ్లకూరు మండలం అర్ధమాలకు ఈ నెల 19న తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు జ్వరం రావడంతో శ్రీకాళహస్తిలోని ఓ ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం జ్వర తీవ్రత అధికం కావడంతోపాటు కడుపులో నొప్పి వస్తుండడంతో ఆమెను రుయా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ప్రమీల శనివారం మృతి చెందింది. అయితే, ఆచారం ప్రకారం కాలనీలోకి తీసుకెళ్లేందుకు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామం బయటే టెంట్లో ఉంచి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. -
శ్రీవారిని దర్శించుకుని వెళుతుండగా..
తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమైన ఓ భక్త బృందం శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం కిన్నెవోరంపాడు పంచాయతీ పరిధిలోని కమ్మపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆగమేఘాలపై పోస్టుమార్టం
తిరుపతి: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన 20 మంది ఎర్రకూలీల మృతదేహాలకు బుధవారం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. 19 మృతదేహాలను అధికారులు గుర్తించారు. 7 మృతదేహాలను బుధవారం రాత్రి వారి బంధువులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు యంత్రాంగం సైతం తిరుపతికి వచ్చింది. తిరువళ్లూర్ కలెక్టర్ వీరరాఘవరావు, నార్త్ జోన్ ఐజీ మంజునాథ తదితర అధికారులున్నారు. మృతదేహాలను తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వమే వాహనాలను సమకూర్చింది. కాగా, ఏపీ డీజీపీ రాముడు బుధవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. తమిళనాడు నుంచి వచ్చిన మృతుల బంధువులు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలీ చేసుకొని తమవారు ఇంటికి తిరిగి వస్తారనుకుంటే, పోలీసులు వారిని పొట్టన పెట్టుకుంటారని ఊహించలేదని వాపోయారు. -
రుయా అంతా మాయ
పని చేయని ఏసీలకు మరమ్మతులు మంచాల కొనుగోలులో గోల్మాల్ సాక్షి, తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. భోజన సదుపాయాల నుంచి స్ట్రెచర్లు, మంచాలు, అధునాతన వైద్యపరికరాల కొనుగోళ్ల వరకు అన్నీ అక్రమాలే. ఆస్పత్రి ప్రాంగణంలోని షాపింగ్ కాంప్లెక్స్ బాడుగల సొమ్ము కూడా రుయా అధికారుల సొంత ఖాతాలకు వెళుతోంది. పనిచేయని ఏసీలకు మరమ్మతుల పేరుతో లక్షలరూపాయలు స్వాహా చేస్తున్నారు. మంచాల కొనుగోళ్లలో అక్రమాలు.. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను రోగులకు అవసరమైన కొత్త మంచాల కొనుగోళ్లలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నా యి. నాణ్యతలేని మంచాలు కొనుగోలు చేయడంతో కొద్ది రోజులకే విరిగిపోతున్నాయి. ఈ వార్షిక సంవత్సరంలో రెండు నెలల వ్యవధిలో రెండు విడతలుగా 200 మంచాలు కొనుగోలు చేశారు. ముందు ఒక్కో మంచం రూ.8,500లకు కొనుగోలు చేయగా రెండోసారి అవే రకం మంచాలను రూ.10,500లకు కొనుగోలు చేశారు. రెండు నెలల గడువులో ఒక్కో మంచానికి రెండు వేల రూపాయలు అదనంగా ఎందుకు చెల్లించారనేది ప్రశ్నార్థకంగా మారింది. దాంతోపాటు రెండోసారి కొనుగోలు చేసిన మంచాల రేకు గేజ్ తక్కువగా ఉండటంతో రోగులు పడుకుంటే అవి వంగిపోతున్నాయి. దీంతో వీటిని ఆరోగ్యశ్రీ వార్డుపైన ఉన్న ఒక గదిలో నిల్వ చేశారు. మంచాల నాణ్యతపై ఒక ప్రొఫెసర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వాటిపై ఎలాంటి విచారణ జరగకుండా కొందరు తొక్కిపెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. షాపుల లీజు సొమ్ము స్వాహా రుయా ఆస్పత్రి ప్రాంగణంలో 17 షాపులు ఉన్నాయి. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఒక్కో షాపునకు రెండు వేల రూపాయలు లీజుగా నిర్ణయించారు. ఈ మొత్తం స్వాహా అవుతున్నట్టు తెలిసింది. వీటికి సంబంధించిన రికార్డులు కూడా లేవని సమాచారం. లీజు రూపంలో కాకుండా కరెంటు బిల్లు కోసం అన్నట్టుగా యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేయడంలోనే గూడుపుఠాణి ఉంది. ఆస్పత్రి కరెంటు బిల్లును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులోనే షాపులకు వినియోగిస్తున్న బిల్లు కూడా జమ అవుతుంది. దీని దృష్ట్యా ప్రత్యేకంగా షాపులకు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో షాపుల యజమానుల నుంచి బాడుగ రూపంలో కాకుండా కరెంట్ బిల్లుల పేరుతో వసూలు చేసిన మొత్తం అనధికారిక ఖాతాలకు వెళుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బాడుగుల రూపంలో వచ్చే మొత్తం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిర్ణయం మేరకు వినియోగించాల్సి ఉంది. అయితే ప్రతి నెలా వసూలయ్యే ఈ మొత్తాలు ఏమవుతున్నాయనే విషయంపై ఆస్పత్రి వర్గాలు పెదవి విప్పడం లేదు. ఏసీల మరమ్మతుల పేరుతో... రుయా ఆస్పత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 36 ఎయిర్‌కండిషనర్లు ఉన్నాయి. వీటిలో 25కు పైగా ఏసీలు పనిచేయడం లేదు. అయితే ఈ ఏడాదిలో వీటి మరమ్మతులకు రెండున్నర లక్షల రూపాయలు బిల్లులు చేసుకోవడం ఇక్కడి అవినీతికి అద్దం పడుతోంది. పనిచేయని వెంటిలేటర్లు రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణవాయువును అందించే ఖరీదైన వెంటిలేటర్లు పనిచేయడం లేదు. మొత్తం 18 వెంటిలేటర్లు ఉండగా అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. ఒకటి ఎయిడ్స్ పేషంట్లకు వినియోగిస్తుండగా మిగిలింది ఒక్కటే. ఈ ఒక్క వెంటిలేటర్‌తో పెద్ద సంఖ్యలో వచ్చే రోగుల ప్రాణాలకు హామీ ఉండదనేది స్పష్టమవుతోంది. మరమ్మతులకు గురైన వాటిని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. నిరుపయోగంగా ఆటో అనలైజర్ సుమారు రూ.50 లక్షలతో కొనుగోలు చేసిన ఆటో అనలైజర్ పరికరం నిరుపయోగంగా ఉంది. ఒకేసారి 200 మందికి సంబంధించిన వివిధ రకాల రక్తపరీక్షలు చేసేందుకు ఈ పరికరం కొనుగోలు చేశారు. దీనిద్వారా రక్తంలోని చక్కెర శాతం, క్రియాటిన్, యూరియా వంటి పరీక్షలను తేలిగ్గా గుర్తించవచ్చు. ఈ పరికరంలో ఒక ఎలక్ట్రిక్ బోర్డు లేదని ఆస్పపత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ పరికరం ఎందుకూ కొరగాకుండా పోయింది. అసలు ఇటువంటి పరికరం ఒకటుందనే విషయం కూడా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. నాణ్యత లేని ఆహారం పంపిణీ రోగులకు పంపిణీ చేసే ఆహారం నాణ్యత ఉండటం లేదు. తక్కువ రకం బియ్యంతో తయారు చేస్తున్న భోజనం ముద్దలు ముద్దలుగా ఉంటోంది. ఈ భోజనం కూడా నిర్ణీత సమయానికి అందించడం లేదు. దీంతో రోగుల బంధువులు బయట నుంచి ఆహారపదార్థాలు తెచ్చిపెడుతున్నారు. ఆస్పత్రిలో ఒక్కో రోగికి ఒకపూట ఆహారానికి గాను రూ.40 ఖర్చు చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 700 మందికి పైగా ఈ సదుపాయం పొందుతున్నారు. ఆహారం పంపిణీ ఆస్పత్రి అధికారులకు కామధేనువుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. వివిధ రకాల జబ్బులున్న రోగులకు వేర్వేరు మెనూ ఉంది. కాని దీనిని అమలు చేయడం లేదు. అందరికీ ఒకేరకమైన ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అవకతవకలు జరగలేదు మంచాల్లో కొన్ని లోపాలు ఉన్నది వాస్తవమే. వాటిలో కొన్ని విరిగిపోయాయి. వేలూరుకు చెందిన ఒక కంపెనీ వీటిని ఇచ్చింది. విరిగిపోయిన వాటి స్థానంలో రీప్లేస్ చేస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఒక రకమైన సొల్యూషన్ లేకపోవడంతో ఇన్ని రోజులు అనలైజర్‌ను ఉపయోగించలేదు. ప్రస్తుతం ఆ సొల్యూషన్ తెప్పించాం. ఇక అనలైజర్ అందుబాటులోకి తెస్తాం. ఇక ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. - వీరాస్వామి, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి