పాస్టర్‌ను దింపి వస్తూ...
కురుపాం, న్యూస్‌లైన్: తిత్తిరి పంచాయతీ గాలిమానుగూడ సమీపంలో ఆదివారం సాయంత్రం మ్యాక్సీపికప్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి నీలకంఠాపురం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిత్తిరి పంచాయతీ దిగువ కీడవాయి గిరిజన గ్రామంలో ఆదివారం సాయంత్రం వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏటా డిసెంబర్లో చర్చి పాస్టర్‌ను మార్చడం ఇక్కడ ఆనవాయి తీగా వస్తోంది. దీనిలో భాగం గా పాస్టర్‌ను దండుసూర గ్రామానికి మ్యాక్సీపికప్‌లో తీసుకెళ్లారు.
అక్కడి నుంచి అదే వాహనంలో తిరిగి వస్తుండగా గాలిమానుగూడ సమీపంలో బోల్తాపడింది. దిగు వ కీడవాయికి చెందిన నిమ్మల సుమిత్ర(22) సంఘటన స్థలంలోనే మృతి చెంద గా, బిడ్డిక గాయత్రి(15) పార్వతీపురం ఏర్పియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరో 22 మందికి గాయాల య్యాయి. తీవ్రగాయాలపాలైన బిడ్డిక తేజేశ్వరి, గాయామి, బిడ్డిక గంగారి, నీల మ్మ, మౌనికలను 108 వాహనాల ద్వారా పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులైన బిడ్డిక మాసి, బిడ్డిక రాయలో, సిరిమంతి, రామారావు, తవిటమ్మ, సావి త్రి, సరన్, ఇందుమతి, బిడ్డక భూది, సు క్కి, లక్ష్మి, గంగాయి, బిడ్డిక సుహాసిని మొండెంఖల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులకు హెచ్‌సీ దొర, జె. ప్రసాద్ సహాయ సహకారాలను అందిస్తున్నారు. నీలకంఠాపురం ఏఎస్ఐ పాపారావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.