పరిహారం రాలేదని యువకుడి బలవన్మరణం
మిడ్మానేరు ముంపు గ్రామం నీలోజిపల్లిలో ఘటన
బోయినపల్లి : మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురవుతున్న నీలోజిపల్లి గ్రామానికి చెందిన అనుముల అనిల్(25) తనకు పరిహారం అందలేదని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అనుముల అంజయ్యకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్దకుమారుడు నాగరాజు, చిన్న కుమారుడు అనిల్ పేర్లు పరిహారం గెజిట్లో ప్రచురించలేదు. దీంతో వీరికి ఎలాంటి పరిహారం మంజూరు కాలేదు. అనిల్ ఇంటర్ వరకు చదువుకుని తండ్రితోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. తన పేరు గెజిట్లో ప్రచురించి ప్రభుత్వం ద్వారా నిర్వాసితులకు ఇచ్చే పట్టా, పరిహారం మంజూరు చేయాలని అనేకసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. కనీసం యువత పరిహారం ఇప్పించాలని గ్రామానికి అధికారులను వేడుకున్నాడు. అయినా ఎలాంటి పరిహారం అందలేదు. దీంతో మనస్తాపం చెంది తన వ్యవసాయ బావి వద్ద సోమవారం క్రిమిసంహారకమందు తాగి మతిచెందాడు. అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎసై ్స కె.సతీశ్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిర్వాసితులకు రావాల్సిన పరిహారం సత్వరం అందించాలని ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు, నీలోజిపల్లి సర్పంచ్ కూస రవీందర్. ఉపసర్పంచ్ ఎర్ర లింగారెడ్డి డిమాండ్ చేశారు.