Neeraj goyat
-
బాక్సింగ్‌కి సిద్ధం
బాక్సింగ్ గ్లౌజ్స్‌తో ముంబై ప్రయాణమయ్యారు వరుణ్‌తేజ్. కొన్నిరోజుల పాటు బాక్సింగ్ శిక్షణలో బిజీగా ఉండబోతున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వరుణ్‌తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ బాక్సర్ పాత్రలో నటించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాక్సర్ పాత్రలో నటించడానికి అమెరికాలో బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ టోనీ జెఫ్రీస్ దగ్గర శిక్షణ తీసుకున్నారు వరుణ్. ఇప్పుడు ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయాత్ దగ్గర కూడా బాక్సింగ్‌కి సంబంధించిన మెళకువలు నేర్చుకోనున్నారు. ప్రపంచ బాక్సింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రవేశించిన తొలి భారతీయ బాక్సర్ నీరజ్. ఆయన దగ్గర బాక్సింగ్ ట్రిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు వరుణ్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. -
'రియో' అర్హతలో నీరజ్ విఫలం
న్యూఢిల్లీ:రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయట్ విఫలమయ్యాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిర్వహించిన ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ లో నీరజ్ కాంస్య పతకానికే పరిమితమై రియో బెర్తును సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం వెనుజులాలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో నీరజ్ గోయట్ (69 కేజీలు) 0-3 తేడాతో అరాజిక్ మారుట్జాన్(జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు సెమీ ఫైనల్లో ఓడిన బాక్సర్ల మధ్య జరిగిన పోరులో కూడా నీరజ్ పరాజయం చెందాడు. సిసోకో డియే యూబా (స్పెయిన్)తో జరిగే బౌట్లో కూడా నీరజ్ వైఫల్యం చెందడంతో రియో అర్హతపై పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది. అంతకుముందు మరో ఇద్దరు భారత ప్రొ బాక్సర్లు గౌరవ్ బిదురి, దిల్బాగ్ సింగ్‌లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. రియో అర్హతలో భాగంగా ప్రపంచంలోని ప్రొ బాక్సర్లకు ఐబా పోటీలు నిర్వహిస్తోంది. ప్రొ బాక్సర్లకు 26 రియో బెర్తులు ఉన్నా, ప్రతీ కేటగిరీ నుంచి ముగ్గురు మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. -
సెమీస్‌లో నీరజ్ ఓటమి
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్ల ఒలింపిక్ అర్హత టోర్నీలో భారత బాక్సర్ నీరజ్ గోయట్ (69కేజీ) సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. గురువారం జరిగిన బౌట్లో నీరజ్ 0-3తో అరాజిక్ మరుత్జాన్ (జర్మనీ) చేతిలో ఓడాడు. అయితే ఈ ఓటమి తనను రియో బెర్త్‌కు దూరం చేయలేదు. సిసోకో డియే యూబా (స్పెయిన్)తో జరిగే బౌట్లో నెగ్గితే మూడో క్వాలిఫయర్‌గా బెర్త్ దక్కించుకుంటాడు.